'పుష్ప'..'ఉప్పెన' కి జాతీయ అవార్డులు ముందే గెస్ చేసిన ఇద్దరు!
ఈ రెండు చిత్రాలకు జాతీయ అవార్డులు వస్తాయని మెగాస్టార్ చిరంజీవి..దర్శకుడు సుకుమార్ ముందే అంచనా వేసారుట.
By: Tupaki Desk | 25 Aug 2023 4:47 AM GMTప్రతిష్టాత్మక 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమాలు సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఏకంగా 10 పురస్కారాలతో తెలుగు సినీమా జాతీయ స్థాయిలో మరోసారి మారు మ్రోగింది. అయితే కొన్ని కొన్ని సినిమాలకు జాతీయ అవార్డులు వరిస్తాయని ముందే గ్రహిస్తుంటారు. ఆ రెండు సినిమాలే 'పుష్ప'..'ఉప్పెన'. ఈ రెండు చిత్రాలకు జాతీయ అవార్డులు వస్తాయని మెగాస్టార్ చిరంజీవి..దర్శకుడు సుకుమార్ ముందే అంచనా వేసారుట.
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన 'ఉప్పెన' సినిమా స్టోరీని ముందు దర్శకుడు బుచ్చిబాబు ...చిరంజీవికే వినిపించారు. అక్కడ నుంచి అనుమతి రాగానే అది సినిమా గా మారింది. ఉప్పెనకి అవార్డు వస్తుందని చిరంజీవి అప్పుడే బుచ్చి బాబుతో చెప్పారుట. తాజాగా అవార్డు రావడంతో బుచ్చిబాబు ఈ విషయాన్ని రివీల్ చేసారు. అలాగే 'పుష్ప' సినిమాలో సెట్ లో ఉండగానే బన్నీకి ఉత్తమ నటుడి అవార్డు వస్తుందని సుకుమార్.. ఆ చిత్ర నిర్మాత నవీన్ తో అనేవారుట.
ఇలా ఒకసారి కాదు పదే పదే అనేవారుట. బన్నీ నటన చూసి సుకుమార్ మంత్రముగ్దుడ య్యేవారని...తనని గొప్ప నటుడిగా భావిస్తారని రివీల్ చేసారు. ఆయన అనుకున్నట్లే బన్నీకి జాతీయ అవార్డు వచ్చింది. ఇలా చిరంజీవి.. సుకుమార్ జాతీయ అవార్డులు ముందుగానే వస్తాయని జోస్యం చెప్పారు. చెప్పినట్లు జరిగింది. ఇక పుష్పరాజ్ గా బన్నీ నటనని మెచ్చని వారంటూ లేరు. చిత్తూరు మాండలీకంలో బన్నీ డైలాగులు ఆద్యంతం ఆకట్టుకుంటాయి.
ఆ సినిమాతో బన్నీలో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా? అనిపించేలా పెర్పార్మెన్స్ చేసాడు. అప్పటివరకూ బన్నీ పాత్రలు వేరు.. అప్పటి నుంచి బన్నీ లెక్క వేరు అని నిరూపించిన చిత్రమిది. పాన్ ఇండియాలో ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ వద్ద కోట్ల కనక వర్షం కురిపించిన చిత్రమది. 'పుష్ప' సుకుమార్ సొంత స్టోరీ. అలాగే 'ఉప్పెన' కథ వెనుక కూడా సుకుమార్ ఉన్నారు. ఆ సినిమా డైరెక్ట్ చేసింది సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు అన్న సంగతి తెలిసిందే.