'చిరుత' బ్యూటీ బీహార్ నుంచి MP గా పోటీ?
రానున్న లోక్‌సభ ఎన్నికలు గ్లామర్ రంగు పులుముకుంటున్నాయి. తాజా సమాచారం మేరకు `చిరుత` బ్యూటీ నేహా శర్మ రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని మీడియాలో కథనాలొచ్చాయి
By: Tupaki Desk | 23 March 2024 11:39 AM GMTరానున్న లోక్‌సభ ఎన్నికలు గ్లామర్ రంగు పులుముకుంటున్నాయి. తాజా సమాచారం మేరకు `చిరుత` బ్యూటీ నేహా శర్మ రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని మీడియాలో కథనాలొచ్చాయి. ఆ మేరకు నేహా శర్మ తండ్రి కాంగ్రెస్ నాయకుడు అజయ్ శర్మ ఒక సమావేశంలో తన కుమార్తె రాజకీయారంగేట్రాన్ని కన్ఫామ్ చేసారు. బీహార్‌లో భాగల్‌పూర్ ఎమ్మెల్యే శర్మ మాట్లాడుతూ-``మహాఘట్‌బంధన్ సీట్ల పంపకంపై చర్చల తర్వాత తమ పార్టీ ఈ స్థానం నుండి పోటీ చేస్తే, తన కుమార్తెకు ఈ నియోజకవర్గం నుండి టిక్కెట్ వచ్చే అవకాశం ఉంద``ని అన్నారు.
``కాంగ్రెస్‌కి భాగల్‌పూర్ నియోజకవర్గం కావాలి.. అది మా కంచుకోట.. సీట్ల పంపకాల ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నాయి. మాకు ఈ సీటు వస్తే, ఎవరు పోటీ చేయాలనేది పార్టీ హైకమాండ్‌పై ఆధారపడి ఉంది. పార్టీ నన్ను అడిగితే నేను పోటీ చేస్తాను లేదా బహుశా నా కుమార్తె నేహా శర్మ ఈ నియోజకవర్గం నుండి పోటీ చేయవచ్చు. వేచి చూడాల్సిందే``’ అని ఎమ్మెల్యే అజయ్ శర్మ అన్నారు. ఎన్‌డిఎతో పోరాడే భారత కూటమి అవకాశాలపైనా, కాంగ్రెస్ విజయంపైనా తనకు నమ్మకం ఉందని బీహార్‌లో బిజెపిని తుడిచిపెడతామని శర్మ అన్నారు.
బీహార్‌లో భారత కూటమి సీట్ల పంపకాల ప్రకటన ఈ వారంలో ఉంటుందని రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నాయకుడు, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ అన్నారు.
ముంబైలో జరిగిన ఆప్ ఇండియా బ్లాక్ ర్యాలీకి హాజరైన తర్వాత మార్చి 18న పాట్నాకు తిరిగి వచ్చిన యాదవ్, మహాగత్బంధన్ మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకం కొన్ని రోజుల్లో నిర్ణయమవుతుందని చెప్పారు.
చిరుత సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన నేహాశర్మ తొలి ప్రయత్నమే రామ్ చరణ్ లాంటి క్రేజీ నటవారసుడి సరసన డెబ్యూగా అవకాశం అందుకుంది. ఆ తర్వాత వరుణ్ సందేశ్ సరసన కుర్రాడు అనే చిత్రంలో నటించింది. ఆ సినిమా తర్వాత నేహా శర్మ తెలుగులో అస్సలు నటించలేదు. అటుపై హిందీ పరిశ్రమలో వరుస చిత్రాల్లో నటించింది. హిందీలో ఓ డజను చిత్రాల్లో నటించింది. చివరిగా జోగిర సర రార అనే చిత్రంలో నటించింది. మలయాళం, మందర భాషల్లోను ఒక్కో సినిమా చేసింది. కానీ ఇటీవల ఈ బ్యూటీకి ఆశించిన విజయాలేవీ దక్కకపోవడంతో కెరీర్ పరంగా డల్ అయింది. గడిచిన రెండు మూడేళ్లుగా నేహా శర్మకు అవకాశాలేవీ రాలేదు. దీంతో ఇప్పుడు తండ్రి బాటలో రాజకీయాల్లోకి అడుగుపెట్టనుందని కథనాలొస్తున్నాయి.