వెంకీమామతో చిరంజీవి పెళ్లి సందడి!
ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంతర్జాలలో వైరల్ గా మారింది. చిరంజీవి, అరవింద్ సాంప్రదాయ పంచెకట్టులో కనిపించగా, వెంకీ పైజామా షరాయిలో కనిపించారు.
By: Tupaki Desk | 18 Feb 2024 8:24 AM GMTమెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరు టాలీవుడ్ మూల స్థంబాలు ఒకేచోట సాంప్రదాయ దుస్తుల్లో కనిపించడంతో ఇది కన్నులపండుగగా మారింది. ఆ ఇద్దరు స్టార్లు ఒక పెళ్లిలో కలుసుకున్నారు. చిరంజీవి తన సోషల్ మీడియాలో ఈ ఫోటోని పోస్ట్ చేసారు. దీంతో ఇది చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. వెంకటేష్, చిరంజీవితో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, మైత్రి మూవీ మేకర్స్ నవీన్, టీజీ విశ్వ ప్రసాద్ తదితరులు ఈ వేడుకలో ఉన్నారు.
చిరంజీవి X లో ఈ ఫోటోలను షేర్ చేస్తూ ఇలా రాసారు. "మా ప్రియమైన స్నేహితుడు కుమార్ కోనేరు కుమారుడు కిరణ్ కోనేరు- శైల్య శ్రీ వివాహ వేడుకల్లో చేరడం ఆనందంగా ఉంది. పెళ్లిలో కొత్త జంటను ఆశీర్వదించాం! మా వెంకీ మామ (వెంకటేష్) కూడా మాతో చేరడంతో ఆనందం రెట్టింపయింది" అని రాసారు. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంతర్జాలలో వైరల్ గా మారింది. చిరంజీవి, అరవింద్ సాంప్రదాయ పంచెకట్టులో కనిపించగా, వెంకీ పైజామా షరాయిలో కనిపించారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. చిరంజీవి తదుపరి 'విశ్వంభర'లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇది భారీ బడ్జెట్ డ్రామా. UV క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ- ప్రమోద్ నిర్మిస్తున్నారు. బాహుబలి ఫేమ్ ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ 'సైంధవ్' తర్వాత మరో చిత్రంలో నటించేందుకు సన్నాహకాల్లో ఉన్నారు.