Begin typing your search above and press return to search.

విశ్వంభర.. ఫినిష్ అయ్యేది ఎప్పుడు?

మూవీకి సంబందించిన ఇంకా రెండు సాంగ్స్, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్, పెండింగ్ ఉన్నాయంట. ఇందులో మెగాస్టార్ చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటి ఉందని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   19 July 2024 3:30 PM GMT
విశ్వంభర.. ఫినిష్ అయ్యేది ఎప్పుడు?
X

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్ లో ఇప్పటి వరకు ఎక్కువగా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేశారు. కేవలం సైరా నరసింహారెడ్డి హిస్టారికల్ ఫిక్షన్ స్టోరీతో తెరకెక్కింది. అయితే ఈ సినిమా ఒక్క తెలుగులో తప్ప ఏ భాషలో కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. వాల్తేరు వీరయ్య కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఆ తరువాత భోళా శంకర్ మూవీ డిజాస్టర్ అయ్యింది.

దీని తర్వాత కాస్తా జోనర్ మార్చిన మెగాస్టార్ సోషియో ఫాంటసీ కథాంశంతో విశ్వంభర మూవీ చేస్తున్నారు. ఆయన చివరిగా అంజి సినిమాని సోషియో ఫాంటసీ జోనర్ లో చేశారు. ఆ సినిమా హిట్ కాలేదు. అయితే జగదేకవీరుడు అతిలోకసుందరి మెగాస్టార్ కెరియర్ లో బెస్ట్ మూవీస్ లో ఒకటిగా ఉంది. ఇప్పుడు అలాంటి కథాంశంతోనే విశ్వంభర సినిమా తెరకెక్కుతోంది.

బింబిసార సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని జెట్ స్పీడ్ తో డైరెక్టర్ కంప్లీట్ చేసేస్తున్నాడంట. మూవీలో చిరంజీవికి జోడీగా స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తోంది. అలాగే మరో ఐదుగురు హీరోయిన్స్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ని త్వరలో స్టార్ట్ చేయబోతున్నారంట.

మూవీకి సంబందించిన ఇంకా రెండు సాంగ్స్, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్, పెండింగ్ ఉన్నాయంట. ఇందులో మెగాస్టార్ చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటి ఉందని తెలుస్తోంది. త్వరలో ఈ సాంగ్ షూట్ ఉంటుందంట. అలాగే మూవీ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ ని అనిల్ అరసు డిజైన్ చేయబోతున్నాడంట. ఈ సీక్వెన్స్ చాలా కొత్తగా ఉండేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ షూటింగ్ ఆగష్టు నాటికి పూర్తి చేయాలని యూవీ క్రియేషన్స్ టార్గెట్ గా పెట్టారంట.

మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఆగష్టు 22న విశ్వంభర టీజర్ ని రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. కనీసం ఫస్ట్ గ్లింప్స్ అయిన ప్లాన్ చేయాలని అనుకుంటున్నారు. వశిష్ట మల్లిడి కూడా గ్యాప్ తీసుకోకుండా షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేయాలని అనుకుంటున్నారు. సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఎక్కువగా ఉండబోతోంది. దానికి కనీసం ఆరు నెలలైనా సమయం కావాలి. అందుకే ఒకటి, రెండు షెడ్యూల్స్ లో షూటింగ్ కంప్లీట్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.