రీల్స్ కి మెగాస్టార్ అంతగా బాండ్ అయ్యారా?
మెగాస్టార్ చిరంజీవి ఎంతగా అప్ డేట్ అయ్యారు? అన్నది చెప్పాల్సిన పనిలేదు. కంబ్యాక్ తర్వాత ఆయనలో చాలా రకాల మార్పులు గమనించవచ్చు.
By: Tupaki Desk | 1 April 2024 7:27 AM GMTమెగాస్టార్ చిరంజీవి ఎంతగా అప్ డేట్ అయ్యారు? అన్నది చెప్పాల్సిన పనిలేదు. కంబ్యాక్ తర్వాత ఆయనలో చాలా రకాల మార్పులు గమనించవచ్చు. ఆ మార్పుల్ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ అయ్యారు. ఈ దూకుడు ఇటీవల కాలంలో మరింత పెరిగింది. సినిమా విశేషాలతో పాటు కుటుంబానికి సంబంధించిన సరదా వీడియోలు అభిమానులు తానే స్వయంగా షేర్ చేస్తున్నారు. ఖాళీ సమయంలో మనవరాళ్లతో ఆడుకోవడం.. వాళ్లతో పాటు ఆయన చిన్నపిల్లాడిలా మారిపోవడం.
కిచెన్ లో వంటలు చేయడం ఇలా అన్ని రకాల యాక్టివిటీస్ లో పాల్గొంటున్నారు. ఇప్పటికే హీరోయిన్లతోనూ ఎంతో చనువుగా మెలుగుతున్నారు. వాళ్లపై సరదాగా జోకులేయం...ఇతర హీరోల చిత్రాల్ని ప్రమోట్ చేయడం ఇలా ఎన్నో మార్పులు గమనించవచ్చు. తాజాగా సోషల్ మీడియాకి ఆయన ఎంత బాండ్ అయిపోతున్నారు? అనడానికి ఇదొక మంచి ఉదహరణగా చెప్పొచ్చు. టాలీవుడ్ డిజిటల్ మీడియా ఫెడరేషన్ నిన్న రాత్రి నిర్వహించిన ఓ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి- విజయ్ దేవరకొండ హాజరయ్యారు.
చిరు ప్రసంగంలో తన జీవితంలో ప్రభావశీలుల ప్రభావం గురించి మాట్లాడారు. సోషల్ మీడియా రీల్స్ చూడటం ఈ మధ్య బాగా అలవాటు చేసుకున్నానన్నారు. `ఆర్థిక సంవత్సరం ముగింపులో.. నేను నా ఆడిటర్లు.. అకౌంటెంట్లు మరియు న్యాయవాదులతో కూర్చున్నాను. వారి దగ్గర పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సిద్ధంగా ఉంది. అందరూ ఆపనిలో బిజీగా ఉన్నప్పుడు నేను మాత్రం తమిళ వంట రీల్స్ చూస్తూ బిజీగా ఉన్నాను. వారు అకౌంట్స్ కి సంబంధించి ఏవో మాట్లాడుతున్నారు. కానీ నేను మాత్రం రీల్స్ టైంపాస్ చేసాను` అన్నారు.
అదే వేదికపై విజయ్ దేరకొండ..చిరు మాధ్య చిట్ చాట్ అంతే ఆసక్తికరంగా మారింది. ఇద్దరు తమ విజయాలు.. మిడిల్ క్లాస్ లైఫ్ గురించి మాట్లాడుకున్నారు. దానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం చిరంజీవి `విశ్వంభర` చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి `బింబిసార` ఫేం మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుంది.