బాత్‌టబ్‌లో చిత్రాంగద హొయలు
చిత్రాంగదకు సోషల్ మీడియాల్లోను అసాధారణ ఫాలోయింగ్ ఉంది.
By: Tupaki Desk | 5 Jun 2024 6:05 AM GMTబాలీవుడ్ లో రెండు దశాబ్ధాల కెరీర్ కి చేరువలో ఉంది చిత్రాంగదా సింగ్. కథానాయికగా చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్స్ లో నటించిన చిత్రాంగద.. 2023లో `సూర్మ` అనే సినిమాతో నిర్మాతగా కూడా మారారు. చిత్రాంగదకు సోషల్ మీడియాల్లోను అసాధారణ ఫాలోయింగ్ ఉంది. దానికి కారణం ఏమిటో ఇదిగో ఇక్కడ ఉంది.
చిత్రాంగద నటిగా ఐటమ్ క్వీన్ గా సుపరిచితురాలు. సోషల్ మీడియాల్లోను జరంత స్పీడ్ గానే ఉంది. నిరంతరం వేడెక్కించే హాట్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ ఇన్ స్టాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తాజాగా మరోసారి రెడ్ హాట్ లుక్ లో దర్శనమిచ్చింది. బాత్ టబ్‌లో రెడ్ హాట్ డ్రెస్ లో కనిపించిన చిత్రాంగద స్టన్నింగ్ ఫోజ్‌లు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. తాజా ఫోటోషూట్ తో మరోసారి చిత్రాంగద ఏం చేస్తోంది? అంటూ అభిమానులు ఆరాలు తీస్తున్నారు.
నిజానికి చిత్రాంగద సింగ్ 19 ఏళ్ల కెరీర్ లో ఎన్నో విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంది. కెరీర్ బండి నెమ్మదిగా సాగినా కానీ, కొన్ని చెప్పుకోదగ్గ విజయాలను ఖాతాలో వేసుకుంది. రెండు దశాబ్ధాలకు చేరువైన ప్రయాణంలో.. అసలు తన ఆది అంతం గురించి ప్రశ్నిస్తే....ఇలా చెప్పింది.
''నేను మోడలింగ్ చేసాను.. కొన్ని మ్యూజిక్ వీడియోలలో కనిపించాను. ఆపై నేను సంతోషంగా వివాహం చేసుకున్నాను. నేను బాలీవుడ్‌లోకి రావాలని అస్సలు ప్రయత్నించలేదు. నా బాలీవుడ్ అరంగేట్రానికి గుర్తుగా `హజారోన్ ఖ్వైషీన్ ఐసీ` నా విధిలో రాసి ఉందని నేను భావిస్తున్నాను. దర్శకుడు సుధీర్ మిశ్రా ఈ చిత్రంలో తన గీత (పాత్ర)గా మోడల్‌ను కోరుకోవడం లేదని తెలిసింది. ఆ పాత్ర ఆడిషన్స్ కోసం నరకయాతన పడ్డాడు. అతడు ఆ పాత్ర కోసం చాలా మంది NSD (నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా) నటులను ఆడిషన్ చేసాడు.
గుల్జార్ సాబ్ దర్శకత్వం వహించిన మ్యూజిక్ వీడియోలో నేను పనిచేసినందున సుధీర్ నన్ను కలవమని ప్రొడక్షన్‌లో ఒకరు సూచించారు. ఆ సమయంలో నేను నా (మాజీ) భర్త (గోల్ఫర్, జ్యోతి రంధవా) టోర్నమెంట్ కోసం కొరియాకు వెళ్లాల్సి ఉంది. అయితే నాకు ఈ కాల్ వచ్చాక నేను వెనక్కి తగ్గాను. ఆడిషన్స్ తర్వాత మోడల్ ఈ పాత్రలో నటించడం ఇష్టం లేదని దర్శకుడు అన్నారు. ఆడిషన్స్‌లో సుధీర్‌కి సహాయం చేస్తున్న స్వానంద్ (కిర్కిరే) ఆ ఆడిషన్‌లో నా డైలాగ్స్ ను ఎలా చెప్పాలనే దానిపై నాకు శిక్షణ ఇచ్చాడు. కే కే మీనన్ లాంటి స్టార్ సరసన నటించాల్సి ఉన్నందున అనుభవజ్ఞురాలైన కథానాయికను నటింపజేయాలనుకున్నాడు. అయితే చివరికి సుధీర్ నాలో కొంత స్పార్క్ చూసి నాతో కలిసి పనిచేయడానికి అంగీకరించాడు`` అని తెలిపారు.
బాలీవుడ్ లోకి ప్రవేశించడానికి చాలా మంది చాలా కష్టపడ్డారని, కానీ బాలీవుడ్‌లో (స్మైల్స్) అడుగుపెట్టడానికి నేను పెద్దగా కఠినమైన సమయాన్ని ఎదుర్కోలేదని అన్నారు. చిత్రాంగద సింగ్ చివరిసారిగా నటించిన `బాబ్ బిస్వాస్`లో తన పాత్రకు గుర్తింపు లభించింది. గ్యాస్‌లైట్ అనే చిత్రంలోను చిత్రాంగద నటించింది.