తేజ్ ఆ సీక్వెల్ కథ ఏమైంది..?
లాస్ట్ఇయర్ బ్రో తర్వాత సాయి తేజ్ కొద్దిపాటి గ్యాప్ తీసుకుని ఈమధ్యనే సంబరాల ఏటిగట్టు అంటూ ఒక సినిమా మొదలు పెట్టాడు.
By: Tupaki Desk | 30 Dec 2024 11:30 AM GMTమెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ యాక్సిడెంట్ తర్వాత సినిమాల పరంగా కాస్త లేట్ అవుతూ వస్తున్నా ఒక దానికి మించి మరొకటి అనిపించేలా చేస్తున్నాడు. లాస్ట్ఇయర్ బ్రో తర్వాత సాయి తేజ్ కొద్దిపాటి గ్యాప్ తీసుకుని ఈమధ్యనే సంబరాల ఏటిగట్టు అంటూ ఒక సినిమా మొదలు పెట్టాడు. ఆ సినిమాతో మొదటిసారి పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు తేజ్. ఐతే తేజ్ ఈ సినిమాతో పాటు ఒక సినిమా సీక్వెల్ చేస్తున్నాడని ఆమధ్య వార్తలు వచ్చాయి. సాయి తేజ్ తో చిత్రలహరి సినిమా తీసిన డైరెక్టర్ కిశోర్ తిరుమల ఆ సినిమాకు సీక్వెల్ గా చిత్రలహరి 2 చేసే ప్లాన్ లో ఉన్నాడని వార్తలు వచ్చాయి.
చిత్రలహరి ఒక ఫెయిల్యూర్ కథ.. లైఫ్ లోనే కాదు లవ్ లో కూడా ఫెయిల్ అవుతాడు. ఐతే ఫైనల్ గా సినిమా ఎండింగ్ లో సక్సెస్ మార్గాన్ని కనిపెడతాడు. ఆ సినిమా యూత్ ఆడియన్స్ కి బాగా ఎక్కేసింది. అంతేకాదు ఆ సినిమాలో సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. 2019 లో వచ్చిన చిత్రలహరి సినిమా తెలుగు ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. ఆ తర్వాత కిశోర్ తిరుమల రెడ్, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా చేసినా అవేవి వర్క్ అవుట్ కాలేదు. అందుకే తేజ్ తో చిత్రలహరి 2 చేయాలని కిశోర్ ఫిక్స్ అయ్యాడు.
కానీ కిశోర్ కథ సిద్ధం చేసినా తేజ్ ఇప్పుడప్పుడే ఆ సినిమా చేసే ఆలోచనలో లేడనట్టు తెలుస్తుంది. చిత్రలహరి 2 సినిమా కోసం తేజ్ అలాంటి లుక్ ని సిద్ధం చేయాలి. ప్రస్తుతం తేజ్ మాత్రం సంబరాల ఏటిగట్టు మీద ఫోకస్ చేస్తున్నాడు. దాదాపు ఏడాది పాటు ఇదే సినిమా చేసేలా ఉన్నాడు. అందుకే చిత్రలహరి 2 ఉంటుందా లేదా అన్న డౌట్ ఇంకా అలానే ఉంది. మరోపక్క కిశోర్ కు కూడా పెద్దగా ఛాన్స్ లు లేవు. ఆయన తీసిన రెడ్, ఆడవాళ్లు మీకు జోహార్లు రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అందుకే ఆ సినిమాల తర్వాత అతనికి ఛాన్సులు రావట్లేదు.
తేజ్ తో చిత్రలహరి 2 సినిమా చేస్తే మాత్రం మళ్లీ కిశోర్ తిరిగి ఫాం లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఐతే హిట్ సినిమా సీక్వెల్ అంటే అది అంత ఈజీ పనేమి కాదు. ఐతే కిశోర్ తిరుమల సినిమాల్లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. అందుకే చిత్రలహరి 2 కచ్చితంగా అతన్ని మళ్లీ డైరెక్టర్ గా తన టాలెంట్ ప్రూవ్ చేసుకునేలా చేస్తుందని ఆడియన్స్ భావిస్తున్నారు.