'చిత్రం' బబ్లూ సినిమాలకు అందుకే దూరంగా!
ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన 'చిత్రం' సినిమాతో ఫేమస్ అయిన బబ్లూ సుపరిచితుడే. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన బబ్లూ తర్వాత కొన్ని సినిమాల్లో నటించాడు.
By: Tupaki Desk | 5 Feb 2025 2:30 PM GMTఉదయ్ కిరణ్ హీరోగా నటించిన 'చిత్రం' సినిమాతో ఫేమస్ అయిన బబ్లూ సుపరిచితుడే. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన బబ్లూ తర్వాత కొన్ని సినిమాల్లో నటించాడు. 'చిత్రం' సినిమాలో పాత్ర పేరు బబ్లూ కావడంతో అదే అతడి వాస్తవ నామంగా మారిపోయింది. నిజానికి బబ్లూ అసలు పేరు సదానంద్. ఈ పేరు ఎవరికీ తెలియ దని.. .ఒక్కోసారి తానే తన పేరు మర్చిపోయేంతగా బబ్లూగా ఫేమస్ అయ్యానన్నాడు.
ఆ సినిమా తర్వాత బబ్లూ కొన్ని సినిమాలు చేసాడు. అయితే చాలా కాలంగా బబ్లూ సినిమాల్లో కనిపించలేదు. అతడి గురించి మీడియాలోనూ ఎక్కడా వార్తలు వచ్చిన సందర్భాలు లేవు. ఈ నేపథ్యంలో తాజాగా బబ్లూ ఓ ఇంటర్వ్యూ ద్వారా అభిమానులకు టచ్ లోకి వచ్చాడు. ఈ సందర్భంగా కెరీర్ విశేషాలను పంచుకున్నాడు. `ముద్దుల మేనల్లుడు సినిమాతోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టాను. ఆ తర్వాత చాలా సినిమాలు చేసాను.
జంధ్యాల గారి పోపుల పెట్టెలో నటించాను. అందులో నా పాత్ర పేరు బబ్లూ. అదే బబ్లు పేరు సినిమాల్లోనూ వాడారు. టీనేజ్ కి వచ్చిన తర్వాత `చిత్రం` చేసాను. ఆ సినిమా తరువాత ఫుల్ బిజీ అయ్యాను. పవన్ కల్యాణ్, బన్నీ, చరణ్ ల సినిమాలు చేసే అవకాశం వచ్చింది. నటుడిగా బిజీగా ఉన్నాను. జీవితం సంతోషగా సాగిపోతుంది. సరిగ్గా ఇదే సమయంలో నా కుటుంబ సభ్యుల్ని ఒక్కొక్కర్ని కోల్పోవడం చూసాను. ఆ సమయంలో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను.
ఇంట్లో నుంచి బయటకు రావడం మానేసాను. సినిమాలకు దూరమయ్యను. ఎవరితోనూ టచ్ లో లేకుండా పోయాను. ఆ తర్వాత సినిమాలు చేయాలనిపించినా అవకాశాలు రాలేదు. అవకాశం వస్తే నటించడానికి సిద్దంగా ఉన్నాను. చిన్న పాత్రలైనా చేయాలని చూస్తున్నాను` అని అన్నాడు.