హాట్ బాంబులా మతి చెడగొడుతున్న చిత్రాంగధ..!
తాజాగా, ఆమె సిల్వర్ కలర్ చంకీల డ్రెస్ ధరించింది. ఆ డ్రెస్ లో ఆమె అందాలు మరింత అందంగా మెరిసిపోతున్నాయి.
By: Tupaki Desk | 17 Sep 2023 6:39 AM GMTబాలీవుడ్ హాట్ బ్యూటీల్లో చిత్రాంగధ కూడా ఒకరు. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆమె ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లో మాత్రమే నటించారు. అక్కడి ప్రేక్షకులకు సుపరిచితమే. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా సంపాదించుకుంది. ఆమె నటించిన సినిమాల కంటే, తన అందాలతోనే ఎక్కువ క్రేజ్ పొందారు. ఆమె వయసు 50కి దగ్గరపడుతున్నా కూడా చెరిగిపోని అందంతో ఆకట్టుకుంటూ ఉంటుంది.
ఇక, ఎక్స్ పోజింగ్ చేయడంలోనూ ఏ మాత్రం మొహమాటం చూపించదు. విపరీతంగా స్కిన్ షో చేస్తూ ఉంటుంది. చిత్రాంగధకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఆ ఫోటోలు షేర్ చేసిన కొద్ది గంటల్లోనే వైరల్ గా మారుతూ ఉంటాయి.
తాజాగా, ఆమె సిల్వర్ కలర్ చంకీల డ్రెస్ ధరించింది. ఆ డ్రెస్ లో ఆమె అందాలు మరింత అందంగా మెరిసిపోతున్నాయి. ముఖ్యంగా తన నడుము కొలతలను చూపిస్తూ కవ్విస్తోంది. ఇక, ఆమె ఎద అందాలు అయితే, కుర్రాళ్ల మతి పోగొట్టేలా ఉప్పొంగి కనపడుతున్నాయి. అసలు 50 ఏళ్లు దగ్గరపడే వయసులో ఇంత అందంగా, ఇంత ఫిట్ గా 25ఏళ్ల అమ్మాయిలా ఎలా కనిపిస్తుందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. నెటజన్లు ఆమె అందాన్ని కామెంట్ల రూపంలో పొగడ్తలు కురిపిస్తున్నారు. చిత్రాంగధకు కేవలం ఇన్ స్టాగ్రామ్ లోనే 1.9మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. కాగా, ఆమె 2005లో తన కెరీర్ ని ప్రారంభించింది. క్రైమ్ డ్రామా హజారోన్ ఖ్వైషీన్ ఐసిలో మొదటిసారి ఆమె వెండితెరపై మెరిసింది. ఈ మూవీలో ఆమె నటకు ప్రశంసల వర్షం కురిసింది.
ఉత్తమ డెబ్ల్యూ అవార్డు కూడా ఆమె దక్కించుకోవడం విశేషం. ఆ తర్వాత యే సాలి జిందగీ (2011), రొమాంటిక్ కామెడీలు దేశీ బాయ్జ్ (2011), ఐ, మీ ఔర్ మెయిన్ (2013), ఫైనాన్షియల్ థ్రిల్లర్ బజార్ (2018) వంటి సినిమాల్లో నటించింది. ఇప్పటికీ, ఆమె చేతుల్లో మంచి ఆఫర్లు ఉన్నాయి. వయసు పెరుగుతున్నా, గ్లామర్ రోల్స్ అందుకుంటూ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తోంది.