ఆ నటుడిలో కసి పట్టుదల ఓ విషంలా!
అయితే నటుడిగా తాను ట్రాన్సపర్ అయ్యే క్రమంలో చాలా సవాళ్లే ఎదుర్కుంటాడని తాజాగా ఇంటర్వ్యూలో రివీల్ చేసాడు.
By: Tupaki Desk | 3 Sep 2024 2:30 PM GMTచియాన్ విక్రమ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ గ్రేట్ యాక్టర్లలో అతనొక్కడు. కమల్ హాసన్ తర్వాత స్థానం విక్రమ్ దే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే గొప్ప నటుడు. విక్రమ్ ఓ పాత్ర పోషిస్తున్నాడు అంటే ? ఆ పాత్రకే వన్నె తీసుకొచ్చే అసాధారణ ప్రతిభావంతుడు. అందుకే అంత గొప్ప నటుడు కాగలిగాడు. 'పీతామగన్', 'కాశీ', 'ఐ', 'అపరిచితుడు' లాంటి చిత్రాలు విక్రమ్ ఏ రేంజ్ నటుడన్నది చెబుతాయి.
ఇటీవల రిలీజ్ అయిన 'తంగలాన్' తో మరోసారి ప్రేక్షకుల్ని తన నట కౌశలంలో ప్రేక్షకుల్ని అలరించిన సంగతి తెలిసిందే. అయితే నటుడిగా తాను ట్రాన్సపర్ అయ్యే క్రమంలో చాలా సవాళ్లే ఎదుర్కుంటాడని తాజాగా ఇంటర్వ్యూలో రివీల్ చేసాడు. ఈ సందర్భంగా 'కాశీ' సినిమాలో తన పాత్రని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.
'ఇందులో నేను అంధుడిగా నటించాను. సినిమాల్లో పాత్రకు అవసరమైనట్లు మారడం, నటించడమంటే నాకు ఇష్టం. ఇతరులతో పోలిస్తే ఏదైనా ప్రత్యేకంగా చేయాలి అని కోరుకునేవాడిని. అది అందరూ చేసినట్లు ఉండకూడదు. నేను మందు తాగను, సిగరెట్ కాల్చను. కానీ సినిమా పట్ల నాకున్న అభిరుచి ఓ విషంలాం టింది. నేను బాగా నటించాలి అనుకున్నప్పుడు అది మరింత విషంగా మారుతుంది.
కాశీ సినిమా( తెలుగులో శ్రీను వాసంతి) లో నటించాను. అందులో నటించిన తర్వాత రెండు..మూడు నెలలు నా కంటి చూపు మందగించింది. సరిగ్గా చూడలేకపోయేవాడిని. ఎందుకంటే అంధుడిగా నటించాలి. అంటే కళ్లు పైకెత్తి పాత్రలో నటించాలి. అలా నటించడంతో ఆ ప్రభావం నా కంటిపై పడింది. మెల్లకన్ను వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు సూచించారు' అని అన్నారు. అలాగే 'ఐ' సినిమా సమయంలో ఓ పాత్ర కోసం బరువు తగ్గే ప్రోసస్ లోనూ అనారోగ్యం బారిన పడినట్లు అప్పట్లో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.