Begin typing your search above and press return to search.

జానీ మాస్టర్ కేసులో ఊహించని విషయాలు.. మరో బిగ్ షాక్

స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఆమె అసిస్టెంట్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

By:  Tupaki Desk   |   17 Sep 2024 7:01 AM GMT
జానీ మాస్టర్ కేసులో ఊహించని విషయాలు.. మరో బిగ్ షాక్
X

స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఆమె అసిస్టెంట్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీనిపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసుని నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి బదిలీ చేశారు. ఈ కేసులో నార్సింగ్ పోలీసులు విచారణ మొదలుపెట్టి ఫిర్యాదు చేసిన యువతి ఇంటికి వెళ్లి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశారు. ఇక కేసులో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నట్లు కథనాలు వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ కొరియోగ్రాఫర్స్, డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ప్రస్తుతం జానీ మాస్టర్ కొనసాగుతున్నారు. ఈ అసోసియేషన్ లో వివాదాలు నడుస్తున్నాయి. ఇంతలో సడెన్ గా జానీ మాస్టర్ పై అతని అసిస్టెంట్ ఏకంగా లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ కేసు పెట్టింది. ఐదేళ్ల క్రితం ఢీ12 షో సమయంలో జానీ మాస్టర్ తో తనకి పరిచయం అయ్యిందని బాధిత యువతి ఫిర్యాదులో తెలిపింది.

తరువాత రెండేళ్లకి అతని దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా జాయిన్ అయ్యాను. ముంబైతో పాటు పలు ప్రాంతాలకి అవుట్ డోర్ షూటింగ్ లకి వెళ్ళినపుడు జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకి పాల్పడేవారిని ఫిర్యాదులో పేర్కొంది. నార్సింగిలో నా ఇంట్లో కూడా జానీ మాస్టర్ చాలా సార్లు లైంగిక దాడి చేశారని బాధిత యువతి చెప్పింది. మతం మారి తనని పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ వేధింపులకి గురి చేసాడని ఆరోపించింది. షూటింగ్ ల సమయంలో కూడా వ్యాన్ లోకి వచ్చి వేధించేవాడని, మాట వినకుంటే అవకాశాలు లేకుండా చేస్తానని బెదిరించేవాడని ఫిర్యాదులో తెలిపింది.

అతని వేధింపులు భరించలేక వర్క్ మానేశానని, అయిన కూడా తనపై వేధింపులకి పాల్పడుతూనే ఉన్నాడని యువతి ఫిర్యాదు రాసుకొచ్చింది. జానీ మాస్టర్ భార్య కూడా నా ఇంటికొచ్చి దాడి చేసిందని యువతి పేర్కొంది. యువతి ఫిర్యాదు ఆధారంగా ఆదివారం రాత్రి నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు ఎస్.హెచ్.వో హరికృష్ణారెడ్డి తెలిపారు. అలాగే పోలీసులు సదరు యువతిని మూడు గంటల పాటు ఆమె ఇంట్లోనే విచారించి స్టేట్మెంట్ నమోదు చేశారు. అనంతరం ఆమెని భరోసా కేంద్రానికి తరలించారు. వైద్యపరీక్షలు కూడా చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి ఆయనని తొలగించనున్నట్లు సమాచారం. అలాగే అసోసియేషన్ నుంచి కూడా సస్పెండ్ చేసే ఆలోచనలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. దీనిపై కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు అందరూ మీటింగ్ పెట్టుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే జనసేన పార్టీ నుంచి జానీ మాస్టర్ ని సస్పెండ్ చేస్తూ లెటర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ నుంచి కూడా సస్పెండ్ చేసి షాక్ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ వివాదంపై జానీ మాస్టర్ ఎలా స్పందిస్తారో చూడాలి.