పవన్ కళ్యాణ్ బట్టలనిండా రక్తం..చూసి కళ్లు తిరిగాయ్!
తాజాగా పీకే గురించి ఛాయాగ్రాహకుడు ఛోటా.కె. నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అవేంటో ఆయన మాటల్లోనే... 'తొలిప్రేమ సినిమా షూటింగ్ జరుగుతుంది.
By: Tupaki Desk | 13 March 2024 1:30 PM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం..సేవాదృక్ఫదం గురించి చెప్పాల్సిన పనిలేదు. పెద్ద స్టార్ అయినా చాలా సాధారణ జీవితాన్ని ఇష్టపడతాడు. ఎదుట వారికి సహాయం చేయడంలో ముందుంటారు. ఆయ నకు తెలిసింది సంపాదించి దాచుకోవడం కాదు...కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం కోసం సంపాదించాలి అన్న వ్యక్తిత్వం ఉన్నవారు. అందుకే అభిమానుల్లో గుండెల్లో దేవుడయ్యాడు. పీకే ప్రజలకు చేసిన సహాయాలు తెలిసింది చాలా కొన్ని మాత్రమే.
బయట ప్రపంచానికి తెలియకుండా ఇంకెన్నో సహాయ కార్యక్రమాలు చేసారు. సహాయం చేసి చెప్పుకోవడం...ప్రచారం పొందడం ఆయనకు ఇష్టం ఉండదు. ఇప్పుడాయన రాజకీయాల్లోనూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాడు. అలాగని సినిమాలు వదిలేయలేదు. సినిమాలు..రాజకీయం అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తూ ముందుకు సాగుతున్నాడు.ప్రస్తుతం ఏపీలో ఎన్నికల నేపథ్యంలో సినిమాల్ని తాత్కాల్కికంగా పక్కనబెట్టి రాజకీయాలు చేస్తున్నారు.
తాజాగా పీకే గురించి ఛాయాగ్రాహకుడు ఛోటా.కె. నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అవేంటో ఆయన మాటల్లోనే... 'తొలిప్రేమ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆ రోజు పవన్ కళ్యాణ్ రవిబాబుతో క్రికెట్ ఆడే షార్ట్ తీస్తున్నాం. కళ్యాణ్ గారు ఓ సుమోలో సెట్స్ కి వచ్చారు. నేను ఆయన కోసం బయట ఎదురు చూస్తున్నా. నన్ను చూసి ఏంటి ఇక్కడున్నారన్నారు. మీకోసమే అని చెప్పాను. అప్పుడు పవన్ వైంట్ అండ్ వైట్ లో ఉన్నారు. సరే పదండి వెళ్దాం అని అందరం కలిసి వెళ్లాం.
ఇంతలో ఓ వ్యక్తి పవన్ కళ్యాణ్ ని చూస్తూ స్కూటర్ డ్రైవ్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ వెనుకగా ఉండటంతో వెనక్కి తిరిగి మరీ చూసాడు. ఇంతలో అతడు ముందున్న కారుని ఢీ కొట్టాడు. దీంతో స్కూటర్ పై వ్యక్తి ఎదిరి కింద పడ్డాడు. బాగా దెబ్బలు తగిలాయి. దీంతో నేన షాక్ లో అక్కడే ఉండిపోయాను. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పరిగెత్తుకుని వెళ్లి అతడిని తన చేతుల్లోకి తీసుకుని తన సుమోని రమ్మని పిలిపించి అతడిని ఎక్కించి ఆసుపత్రికి పంపించాడు.
అప్పుడు పవన్ తెలుపు బట్టలనిండా రక్తం అయింది. అప్పుడు ఆయన షూటింగ్ లో ఉన్నారు? అన్న విషయాన్ని కూడా మర్చిపోయారు. అది పవన్ కళ్యాణ్ గొప్పతనం. సహాయం అంటే ఆయన ఎంతో చలించిపోతారు. ముక్కు..ముఖం తెలియకపోయినా అయ్యో అతడు ఏ కష్టంలో ఉన్నాడని అలోచిస్తూనే ఉంటారు' అని అన్నారు.