Begin typing your search above and press return to search.

పాపుల‌ర్ గాయ‌కుడు 43,000 కోట్లకు ప‌రువు న‌ష్టం దావా

సోష‌ల్ మీడియాలో క్లిక్ లు లైక్‌లతో డాల‌ర్లు ఆర్జించే గేమ్‌లో త‌న‌ను బ‌లిప‌శువును చేసారంటూ ఆరోపించాడు వివాదాస్ప‌ద పాప్ గాయ‌కుడు క్రిస్ బ్రౌన్

By:  Tupaki Desk   |   23 Jan 2025 3:47 AM GMT
పాపుల‌ర్ గాయ‌కుడు 43,000 కోట్లకు ప‌రువు న‌ష్టం దావా
X

సోష‌ల్ మీడియాలో క్లిక్ లు లైక్‌లతో డాల‌ర్లు ఆర్జించే గేమ్‌లో త‌న‌ను బ‌లిప‌శువును చేసారంటూ ఆరోపించాడు వివాదాస్ప‌ద పాప్ గాయ‌కుడు క్రిస్ బ్రౌన్. త‌న‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన‌ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీపై 43,000 కోట్ల (500 మిలియన్ డాల‌ర్ల‌)కు అత‌డు దావా వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు.

గ‌తేడాది డిస్క‌వ‌రీ నెట్‌వర్క్ `నో ఎక్స్‌క్యూస్ ఫర్ అబ్యూస్` ప్రచారంలో భాగంగా `క్రిస్ బ్రౌన్: ఎ హిస్టరీ ఆఫ్ వయోలెన్స్` అనే డాక్యుసీరీస్‌ను ప్రకటించింది. దీంతో ప్ర‌భుత్వం స్పందించి వారిపై చట్టపరమైన చర్యకు పూనుకుంది. వెరైటీలో ఓ క‌థ‌నం ప్రకారం.. క్రిస్ బ్రౌన్ నిర్మాతలు వార్నర్ బ్రదర్స్ త‌న‌పై ఉద్ధేశ‌పూర్వ‌కంగా ప‌రువు న‌ష్టం క‌లిగించే వాద‌న‌ల‌ను చేసార‌ని ఆరోపించారు. అంతేకాకుండా వారు చూపించే ఆధారాలు పూర్తిగా అబద్ధం అని పేర్కొన్నారు. ఈ కేసులో మీడియా త‌న సొంత లాభాల కోసం స‌త్యాన్ని హ‌త్య చేసింద‌ని బ్రౌన్ దావాలో నివేదించాడు.

ఆంపుల్ LLC , వార్నర్ బ్రదర్స్ లైక్‌లు, క్లిక్‌లు, డౌన్‌లోడ్‌లతో డాలర్లను సంపాదించుకోవడానికి నాపై త‌ప్పుడు నిరాధార ఆరోప‌ణ‌లు చేసాయ‌ని ప్ర‌త్యారోప‌ణ‌లు చేసాడు. అక్ట‌బ‌ర్ లో ప్ర‌సార‌మైన డాక్యుమెంట‌రీ అబద్ధాలు, మోసాలతో నిండి ఉందని, ప్రాథమిక జర్నలిస్ట్ సూత్రాలను ఉల్లంఘించిందని క్రిస్ బ్రౌన్ ఆరోపించారు. త‌న వ్యాజ్యంలో జేన్ డో వాద‌న‌ల‌ను కూడా క్రిస్ బ్రౌన్ ఖండించాడు. స‌న్నిహిత భాగ‌స్వామిపై హింస ఆరోప‌ణ‌ల‌ను అత‌డు తోసిపుచ్చాడు.

అయితే గాయ‌కుడు క్రిస్ బ్రౌన్ గతంలో తప్పులు చేశాడని కూడా దావాలో అంగీకరించాడు. 2017లో తన డాక్యుమెంటరీ `క్రిస్ బ్రౌన్: వెల్‌కమ్ టు మై లైఫ్`లో బహిరంగంగా త‌న తప్పుల‌ను అంగీకరించాడు. ఆ అనుభవాల నుండి ఎదిగాన‌ని అన్నాడు. తాజా వివాదం గురించి వార్నర్ బ్రదర్స్ ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.