క్రిస్మస్ బాక్సాఫీస్ ఫైట్.. పోటీలో ఉండేదెవరు?
మేకర్స్ కూడా ప్రమోషన్స్ స్ట్రాంగ్ గా చేయబోతున్నారు. దీని తర్వాత డిసెంబర్ లో క్రిస్మస్ సీజన్ కి వచ్చే సినిమాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
By: Tupaki Desk | 7 Nov 2024 6:30 AM GMTడిసెంబర్ నెలలో సినిమాల సందడి ఎక్కువగా ఉండబోతోంది. ఇప్పటికే టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’ రిలీజ్ కి సంబందించిన బజ్ సోషల్ మీడియాలో నడుస్తోంది. డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా పబ్లిక్ అటెన్షన్ ఉంది. మేకర్స్ కూడా ప్రమోషన్స్ స్ట్రాంగ్ గా చేయబోతున్నారు. దీని తర్వాత డిసెంబర్ లో క్రిస్మస్ సీజన్ కి వచ్చే సినిమాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
టాలీవుడ్ నుంచి నితిన్ ‘రాబిన్ హుడ్’ డిసెంబర్ 20కి రిలీజ్ కావడం కన్ఫర్మ్ అయ్యింది. వెంకి కుడుముల దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. శ్రీలీల ఈ చిత్రంలో నితిన్ కి జోడీగా నటించింది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ఉండబోతోంది. అలాగే అల్లరి నరేష్ కూడా అదే టైమ్ లో రాబోతున్నాడు.
నరేష్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి ఈ మధ్యాకాలంలో ప్రయోగాలు చేస్తున్నాడు. ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో ‘బచ్చలమల్లి’ తెరకెక్కుతోంది. రియల్ లైఫ్ రౌడీ షీటర్ కథతో ఈ సినిమా ఉండబోతోందనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంతో కచ్చితంగా కమర్షియల్ సక్సెస్ అందుకోవాలని నరేష్ చూస్తున్నారు. అమృత అయ్యర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది.
ఈ రెండు సినిమాలు మాత్రమే క్రిస్మస్ సీజన్ లో టాలీవుడ్ నుంచి రానున్నాయని తెలుస్తోంది. ఇక తమిళంలో వెట్రిమారన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సూరి నటించిన ‘విడుదలై 2’ రిలీజ్ కన్ఫర్మ్ అయ్యిందంట. ఈ సినిమాపై తమిళనాట భారీ అంచనాలు ఉన్నాయి. హిందీలో వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కిన ‘బేబీ జాన్’ మూవీ డిసెంబర్ 20న రిలీజ్ కాబోతోంది.
తమిళ్ హిట్ మూవీ ‘తెరి’ కి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. అయితే హిందీకి కథలో కొన్ని మార్పులు చేసి మరింత యాక్షన్ ఎలిమెంట్స్ జోడించినట్లు రీసెంట్ గా వచ్చిన టేస్టర్ కట్ బట్టి తెలుస్తోంది. ఈ సినిమాలో వరుణ్ ధావన్ కి జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. కచ్చితంగా ఈ మూవీతో వరుణ్ ధావన్ బాలీవుడ్ లో సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నారు. నాలుగు సినిమాలు అయితే క్రిస్మస్ సీజన్ లో పోటీ పడుతున్నాయి. ఈ సినిమాలలో ఎన్ని కమర్షియల్ సక్సెస్ అందుకుంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్ లో మరికొన్ని సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకొచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.