బన్నీ-చరణ్ పక్కపక్కనే ఫ్యాన్స్ దిల్ ఖుష్!
ఇలా కాంబినేషన్స్ కలవడం అన్నది అప్పటికప్పుడు అలా జరిగిపోతుంది తప్ప ఏదీ ప్లానింగ్ అంటూ ఉండదు
By: Tupaki Desk | 26 Dec 2023 5:43 AM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలుసుకున్న సందర్భాలు చాలా తక్కువ. నిత్యం ఎవరి బిజీలో వారు ఉండటంతో కలుసుకోవడం అన్నది సాధ్యపడదు. షూటింగ్ లు..ఇతర వ్యవహారాల్లో ఎవరికి వారు బిజీగా ఉంటారు. ఒకరి సినిమా ఈవెంట్లో మరొకరు కలుసుకోవడం అన్నది కూడా పెద్దగా చోటు చేసుకోలేదు. ఇక కలిసి సినిమా చేస్తారు? అన్న గాసిప్ కూడా ఎక్కడా ఇంతవరకూ తెరపైకి రాలేదు.
ఇలా కాంబినేషన్స్ కలవడం అన్నది అప్పటికప్పుడు అలా జరిగిపోతుంది తప్ప ఏదీ ప్లానింగ్ అంటూ ఉండదు. ఇక పండగలు..పబ్బాలు చోటు చేసుకున్నప్పుడు మాత్రం రెండు ఫ్యామిలీలు తప్పక కలుస్తుంటాయి. వేడుకలు వచ్చినప్పుడు అంతా ఒకేచోట హాజరై ఆ వేడుకను సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రత్యేకంగా సంక్రాంతి పండుగ వచ్చిందంటే? మెగా ఫ్యామిలీ అంతా బెంగుళూరులోని చిరంజీవి ఫామ్ హౌస్ లో సెలబ్రేట్ చేసుకుంటారు.
ఆ వేడుకలో మాత్రం ఎవరూ మిస్ కారు. అంతా తప్పకుండా హాజరవుతుంటారు. విదేశాల్లో షూటింగ్ ల్లో..ముఖ్యమైన బిజీ పనులు ఉంటే తప్ప హాజరు కారు గానీ....అందుబాటులో ఉంటే కచ్చితంగా అంతా అటెండ్ అవుతుంటారు. తాజాగా క్రిస్మస్ ని అలాగే హైదరాబాద్ లో అంతా ఒకే చోట హజరై వేడుక చేసుకున్నట్లు తెలుస్తోంది. మెగా కుటుంబానికి చెంది చిరంజీవి తర్వాత తరం జనరేషన్ అంతా కలిసి వేడుక చేసుకున్నారు.
ఈ సందర్భంగా అంతా ఓ గ్రూప్ ఫోటో దిగారు. అందులో దాదాపు అందరూ ఉన్నారు. ఎక్కువగా లేడీస్ ఉన్నారు. దీంతో ఆ ఫోటో లేడీ డామినేషన్ గా కనిపిస్తోంది. ఇక ఇదే పిక్ లో చివర్లో బన్నీ-చరణ్ పక్కప క్కనే నుంచున్నారు. ఇద్దరు నవ్వుతూ కెమెరాకి ఫోజులిచ్చారు. ఇది చాలా రేర్ మూవ్ మెంట్ కావడంతో బన్నీ-చరణ్ అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. బావ-బామ్మర్ది ఇద్దరు ఒకే ప్రేమ్ లో అంటూ సరదాగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.