Begin typing your search above and press return to search.

10 ఏళ్ల తర్వాత రీ రిలీజ్‌... ప్రపంచ వ్యాప్తంగా రికార్డ్‌లు

ప్రముఖ హాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ క్రిస్టోఫర్‌ నోలన్‌ దర్శకత్వంలో రూపొంది 2014లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఇంటర్‌ సెల్లర్‌' మూవీ అప్పట్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   17 Dec 2024 10:30 AM GMT
10 ఏళ్ల తర్వాత రీ రిలీజ్‌... ప్రపంచ వ్యాప్తంగా రికార్డ్‌లు
X

ప్రముఖ హాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ క్రిస్టోఫర్‌ నోలన్‌ దర్శకత్వంలో రూపొంది 2014లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఇంటర్‌ సెల్లర్‌' మూవీ అప్పట్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఉన్న స్థాయిలో మల్టీ ప్లెక్స్‌లు, బిగ్‌ స్క్రీన్‌లు, ఐమాక్స్‌ స్క్రీన్‌లు లేకున్నా వసూళ్లు భారీగా నమోదు అయ్యాయి. ఆ సినిమా ఎన్నో సార్లు టీవీల్లో చూడడంతో పాటు, ఓటీటీలోనూ ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా చూడబడ్డ సినిమాల జాబితాలో ఇంటర్‌స్టెల్లర్‌ సినిమా కూడా ఒకటి ఉంటుంది అనే విషయంలో అనుమానం లేదు.

ఇంటర్‌ స్టెల్లర్‌ సినిమా రీ రిలీజ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రిస్టోఫర్‌ నోలన్ ఫ్యాన్స్‌ డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు సినిమా ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ అయ్యింది. విడుదల అయిన పది సంవత్సరాల తర్వాత కూడా అదే స్థాయి క్రేజ్‌, అదే స్థాయి అభిమానంను ప్రేక్షకులు ప్రదర్శిస్తూ వస్తున్నారు. హాలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తున్న టాక్‌ ప్రకారం సినిమా రీ రిలీజ్‌లోనూ సంచలన వసూళ్లు నమోదు చేస్తుంది. డైరెక్ట్‌ సినిమాలు ఎలా అయితే విడుదల సమయంలో భారీ ఓపెనింగ్స్‌ను రాబడుతాయో అదే విధంగా ఈ సినిమా పదేళ్ల తర్వాత రీ రిలీజ్ అయినా అంతే స్థాయిలో వసూళ్లు రాబడుతూ ఉంది.

ఇంటర్‌ స్టెల్లర్‌ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్‌ 6న రీ రిలీజ్‌ అయ్యింది. విడుదలైన ప్రతి చోట డాలర్ల వర్షం కురిపిస్తోంది. ఇండియాలోనూ ఈ సినిమాకు పెద్ద ఎత్తున అభిమానులు ఉంటారు. ముఖ్యంగా దర్శకుడు క్రిస్టోఫర్‌ నోలన్‌ ఏ సినిమా చేసినా థియేటర్ల ముందు క్యూ కట్టే ఇండియన్‌ ప్రేక్షకులు చాలా మంది ఉంటారు. అలాంటిది ఇప్పటి వరకు ఇంటర్‌ స్టెల్లర్‌ను ఇండియాలో రీ రిలీజ్ చేయలేదు. అందుకు పలు కారణాలు ఉన్నాయి. స్థానిక భాషల్లో ఈసారి విడుదల చేయడంతో పాటు టెక్నికల్‌కి సంబంధించిన విషయాల్లో కాస్త జాప్యం జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

2025 జనవరి నెలలోనే ఇంటర్ స్టెల్లర్‌ సినిమాను ఇండియాలో భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా సాధిస్తున్న వసూళ్లు చూస్తు ఉంటే ఇండియాలో గతంలో చూసిన వారు మాత్రమే కాకుండా క్రిస్టోఫర్‌ నోలన్‌ సినిమాలను ఇష్టపడే మరింత మంది సైతం ఈసారి థియేటర్‌లలో చూడటానికి ఆసక్తిగా ఉన్నారు. ఐమ్యాక్స్ వర్షన్‌లో అత్యధికులు చూస్తున్నారు అంటూ మేకర్స్‌ చెబుతున్నారు. ఇండియాలో రిలీజ్ అయిన సమయంలో వసూళ్లు ఎలా ఉంటాయి అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాధారణంగానే హాలీవుడ్‌ సినిమాలకు ఇండియాలో మంచి ఆధరణ ఉంటుంది. కనుక ఇంటర్‌ స్టెల్లర్‌కి సైతం మంచి స్పందన దక్కే అవకాశాలు ఉన్నాయి.