Begin typing your search above and press return to search.

స్టార్ డైరెక్ట‌ర్ పారితోషికం 600 కోట్లు?

ఇదిలా ఉంటే.. ప్ర‌ముఖ హాలీవుడ్ డైరెక్ట‌ర్ తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఒకే ఒక్క సినిమాకి ఏకంగా 600 కోట్ల పారితోషికం అందుకున్నాడు.

By:  Tupaki Desk   |   10 March 2024 5:28 AM GMT
స్టార్ డైరెక్ట‌ర్ పారితోషికం 600 కోట్లు?
X

భార‌తీయ సినీప‌రిశ్ర‌మ‌లో 100 కోట్లు అంత‌కుమించి పారితోషికాలు అందుకునే స్టార్ హీరోలు అర‌డ‌జ‌ను మంది ఉన్నారు. కానీ 100 కోట్ల పారితోషికం అందుకునే ద‌ర్శ‌కుడు ఎవ‌రూ లేరు. రెమ్యున‌రేష‌న్, లాభాల్లో వాటాలు అంటూ చాలా మంది ద‌ర్శ‌కులు ఎంత ప్ర‌య‌త్నించినా కానీ రూ.100 కోట్ల లోపే అందుకుంటున్నారు. నిజానికి కొంద‌రు ద‌ర్శ‌కులే నిర్మాత‌లుగా మారి పెట్టుబ‌డులు స‌మ‌కూరుస్తూ వంద‌ల కోట్లు ఆర్జిస్తున్నారు. ఆదాయ ఆర్జ‌న‌కు ఒక్కొక్క‌రు ఒక్కో ఫార్ములాను అనుస‌రిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ప్ర‌ముఖ హాలీవుడ్ డైరెక్ట‌ర్ తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఒకే ఒక్క సినిమాకి ఏకంగా 600 కోట్ల పారితోషికం అందుకున్నాడు. అత‌డు తెర‌కెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1 బిలియన్ డాలర్లు (8274 కోట్లు) వసూలు చేయడం ద్వారా బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది. ఇది అణుబాంబు పితామహుడు రాబర్ట్ ఒపెన్‌హైమర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన చిత్రం. ఓపెన్ హైమ‌ర్ అనేది టైటిల్. ఈ కళాఖండానికి ద‌ర్శ‌కుడు క్రిస్టోఫర్ నోలన్ అందుకున్న‌ పారితోషికం ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తోంది.

నోలాన్ వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నాడు. ఓపెన్ హైమ‌ర్ తో గత ఏడాది సంచ‌ల‌న విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్నాడు. అందుకే అత‌డు సుమారు 72 మిలియన్ డాలర్లు (భారత రూపాయలలో సుమారు 600 కోట్లు) పారితోషికంగా వసూలు చేసినట్లు సమాచారం. మీడియా క‌థ‌నాల‌ ప్రకారం.. క్రిస్టోఫర్ నోలన్ తన ఫీజుగా సినిమా ద్వారా వ‌చ్చే లాభాల్లో వాటా తీసుకున్నాడు. ముందస్తు పార‌తోషికం విధానాన్ని ఎంచుకోకుండా కలెక్షన్లలో వాటాను ఎంచుకున్నందున నోలన్ తన ఉత్పత్తిపై అత్యంత నమ్మకంతో ఉన్నాడని నిరూప‌ణ అయింది. ఒప్పందం ప్ర‌కారం... రూ. 8274 కోట్లు వ‌సూలు చేసిన సినిమా నుంచి త‌న వాటాగా 600 కోట్లు అందుకున్నాడు.

2023లో మరో భారీ చిత్రం 'బార్బీ'తో పోటీప‌డి విడుద‌లైనా కానీ.. ఓపెన్ హైమ‌ర్ బాక్సాఫీస్ వద్ద బలమైన ప్రదర్శనతో ఆక‌ట్టుకుంది. ఇది R-రేటింగ్ ఉన్న చిత్రం. దీనికి ప‌రిమితులు ఉన్నాయి. 13 ఆస్కార్ నామినేషన్లను పొందింది. ఈ సంవత్సరం ప్రతిష్టాత్మక అవార్డులన్నిటా ఆధిపత్యం చెలాయిస్తుంది. ఓపెన్ హైమ‌ర్‌లో సిలియన్ మర్ఫీ టైటిల్ రోల్ పోషించారు. రాబర్ట్ డౌనీ జూనియర్, ఎమిలీ బ్లంట్, ఫ్లోరెన్స్ పగ్, మాట్ డామన్ ఇతర కీలక పాత్రలు పోషించారు.