కూతురికి DNA పరీక్ష చేయించాలన్న నటుడు?
తాజాగా వి.ఆర్ యువా యూట్యూబ్ ఛానెల్‌లో అనన్యతో చేసిన చాట్‌లో చంకీ కుమార్తెలోని లోపాలలో ఒకదాని గురించి బహిర్గతం చేసాడు.
By: Tupaki Desk | 3 Dec 2024 2:30 PM GMTలైగర్ బ్యూటీ అనన్య పాండే కెరీర్ పరంగా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 2019లో 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'లో అరంగేట్రం చేసినప్పటి నుండి వైవిధ్యమైన పాత్రలలో అద్భుత నటనా ప్రతిభను కనబరిచింది. అనన్య తండ్రి, నటుడు చుంకీ పాండే తన కుమార్తె నటనలో లోటు పాట్ల గురించి నిజాయితీగా తాను ఏమనుకుంటున్నారో బహిరంగంగా చెప్పడానికి వెనకాడరు. అనన్య బలాలు లేదా బలహీనతలను అతడు విశ్లేషిస్తారు.
అరంగేట్రం నుండి రకరకాల పాత్రలలో అనన్య నటించింది. తాజాగా వి.ఆర్ యువా యూట్యూబ్ ఛానెల్‌లో అనన్యతో చేసిన చాట్‌లో చంకీ కుమార్తెలోని లోపాలలో ఒకదాని గురించి బహిర్గతం చేసాడు. తన అరుపు అంత బావుండదని అన్నాడు. అది ఎందుకనో నచ్చలేదని తెలిపారు. మీరు మంచి నటుడిని అని అనుకుంటున్నారా? అని చంకీని అనన్య ప్రశ్నించింది. అతడు చాలా కామిక్ గా స్పందిస్తూ ''ఇంట్లోనా లేదా తెరపైనా? నేను స్క్రీన్‌పై కంటే ఇంట్లోనే మంచి నటుడిని అని అమ్మ అనుకుంటుంది'' అని అన్నాడు. అనన్య తన తల్లి గురించి ఒక సరదా ఘటన గురించి షేర్ చేయడంతో తండ్రీ-కూతురు ద్వయం నవ్వులు చిందించారు. మా అమ్మ నాన్న గొడవపడినప్పుడల్లా నాన్నతో అమ్మ ఇలా అంటుంది. ''స్క్రీన్ కోసం దాన్ని సేవ్ చేయి అని అమ్మ చెబుతుంది. నాకు ఇది చాలా ఫన్నీగా అనిపిస్తుంది'' అని అన్నారు.
చంకీ పాండే తన కుమార్తె నటనా సామర్ధ్యంపై ప్రశంసలు కురిపిస్తూ...తన ఎదుగుదల గురించి కూడా మాట్లాడారు. ఎనిమిది ఎపిసోడ్‌ల 'కాల్ మి బే' వంటి సిరీస్‌ను ముందుకు నడిపించగల అనన్య సమర్థతను హైలైట్ చేశాడు. షో అంతటా ప్రేక్షకులు దృష్టి సారించేలా, పూర్తిగా నిమగ్నమయ్యేలా చేయడంలో అనన్య చరిష్మా, నట ప్రదర్శనను ప్రత్యేకంగా ప్రశంసించాడు. తన నటనా ప్రయాణాన్ని కూతురితో పోల్చిచూస్తూ చంకీ చమత్కరించాడు. అతడు ఏవో కొన్ని సన్నివేశాలలో రాణించానని.. కానీ అనన్య మొత్తం ప్రాజెక్ట్‌ను ముందుకు నడిపించడంలో అనన్య ప్రతిభ తనను ఆశ్చర్యపరిచిందని, తన కుమార్తె డిఎన్‌ఎను తనిఖీ చేయాలనుకుంటున్నానని చమత్కరించాడు.
అనన్య తనలోని లోపాల గురించి చెప్పాల్సిందిగా తన తండ్రిని అడిగింది. కొన్నిసార్లు నువ్వు 'అరుపు'ను తగ్గించాలని నేను భావిస్తున్నాను.. అరిచే ప్రతిసారీ నీవు ఎక్కడ ఉన్నా ఆపుతాను. అయితే లోపాలున్నప్పటికీ ప్రతి నటుడూ అదే చేస్తాడు. నిజానికి లోపాల వల్ల మనం మంచి నటులమవుతాము అని చంకీ అన్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.... చంకీ పాండే ఇటీవల అనుపమ్ ఖేర్‌తో 'విజయ్ 69'లో స్క్రీన్‌ను షేర్ చేసుకున్నారు. అనన్య పాండే చివరిసారిగా విక్రమాదిత్య మోత్వానే CTRLలో కనిపించింది. వివేక్ సోనీ 'చాంద్ మేరా దిల్', లక్ష్య లాల్వానీ సినిమాలోను నటించనుంది. 2025లో ఈ సినిమాలు విడుదలవుతాయి.