పడకగదిలో వైఫ్ దగ్గరకు రానివ్వలేదన్న నటుడు!
తెర కోసం నటించినా కొన్ని క్రూరమైన విలన్ పాత్రల ఇంపాక్ట్ నటుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
By: Tupaki Desk | 19 Jan 2025 10:30 PM GMTతెర కోసం నటించినా కొన్ని క్రూరమైన విలన్ పాత్రల ఇంపాక్ట్ నటుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒక్కోసారిత భయపెట్టే విలనీ వ్యక్తిగత సంసార జీవనంలోకి కూడా జొరబడిపోతుంది. ఇంట్లో వాళ్లు కూడా భయపడేలా, దూషించేలా తీవ్ర పరిస్థితిని తెస్తుంది. అతడు తెరపై నటించాడు.. దీనిని సీరియస్ గా తీసుకోకూడదు! అనే జిజ్ఞాస కూడా ఉండదు. అలాంటి పరిస్థితులను చాలా మంది విలన్లు ఎదుర్కొన్నారు. కొందరు ప్రజలు లేదా మహిళల చేతిలో దెబ్బలు, తిట్లు కూడా తిన్నారు. విలన్లుగా అత్యాచార సన్నివేశాల్లో నటించినా, లేదా రక్తపాతం హింసాత్మక పాత్రల్లో నటించినా వాటి ప్రభావం పిల్లల మనసుపైనా తీవ్రంగా ఉంటుంది.
అదంతా అటుంచితే `బేగం జాన్` చిత్రంలో భయంకరమైన విలన్ గా కనిపించిన చంకీ పాండేకు ఒక వింతైన అనుభవం ఎదురైంది. అతడిని తన భార్య పడక గదిలోకి రానివ్వలేదట. ఆమె అతడిని చూసి చాలా భయపడింది. బేగం జాన్ చిత్రం చూశాక .. అతడి వల్ల బెడ్ రూమ్ లో తనకు హాని ఉంటుందని భావించిందట. అలాంటి పాత్రలను పోషించడం ఎంత సులభం కాదని చంకీ అన్నాడు. తనను సెట్‌లో మాత్రమే కాకుండా, తన ఇంట్లో కూడా తేడాగా చూసారని తెలిపాడు.
ఆ పాత్రలో నటించాక తన భార్య భావన పాండే తనతో పాటు అదే బెడ్‌రూమ్‌లో పడుకోవడానికి నిరాకరించిందని తాజా ఇంటర్వ్యూలో చెప్పాడు. తన పాత్రలో ఇంటెన్సిటీ ఎంతగా ప్రభావం చూపించింది అంటే..! తన భార్య నిద్రలో తనను బాధపెడతాడేమోనని భయపడింది.. అని తెలిపాడు. అయితే అతడి నటన ఎంతగా ప్రభావితం చేసిందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. చంకీ పాండే కెరీర్ లో ఇది అద్భుతమైన మైలు రాయి అవకాశం.
చంకీ పాండే లైగర్ బ్యూటీ అనన్య పాండే తండ్రి. సాహో చిత్రంలోను అతడు విలన్ గా నటించాడు. సాహోలో ప్రభాస్ - శ్రద్ధా కపూర్ జంటగా నటించగా, సుజీత్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించింది.