సీనియర్ కే ముచ్చెమటలు పట్టించిన జూనియర్ హీరోలు!
నటుడిగా బాలీవుడ్ లో తనకంటూ కొన్ని పేజీలు రాసి పెట్టుకున్నారు.
By: Tupaki Desk | 10 Jan 2025 11:30 AM GMTబాలీవుడ్ సీనియర్ నటుడు చుంకీ పాండే హీరోగా ఎలాంటి సంచలనాలు నమోదు చేసారో చెప్పాల్సిన పనిలేదు. మూడు దశాబ్ధాల సినీ కెరీర్ లో ఎన్నో హిట్ చిత్రాలున్నాయి. నటుడిగా బాలీవుడ్ లో తనకంటూ కొన్ని పేజీలు రాసి పెట్టుకున్నారు. హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ప్యాన్ బేస్ ని సంపాదించుకున్నాడు. అతడి స్టైల్..స్వాగ్ అంటే మార్కెట్ లో ఓ బ్రాండ్. అలాంటి లెజెండరీ నటుడినే అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు ముచ్చెమటలు పట్టించినట్లు తెలుస్తోంది.
అవును ఈ విషయం చుంకీ పాండే ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు. చుంకీ పాండే తర్వాత తరం హీరోలు ఎవరు? అంటే అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, గోవిందా, అజయ్ దేవగణ్ లాంటి వారు వస్తారు. వీరంతా 90వ దశకంలో ఎంట్రీకి ఇచ్చారు. అప్పుడప్పుడే వాళ్ల కెరీర్ మొదలైంది. అయితే ఇలా కొత్త తరం నటులు బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోన్న సమయంలో చుంకీ పాండే అభద్రతా భావానికి గురైయ్యారుట. అలాగే హీరోగా తన స్థానం పదిలంగా ఉంటుందా? ఉండదా? అని భయపడినట్లు తెలిపారు.
అయితే వాళ్ల ఎంట్రీ ఎంత అభద్రతకు గురి చేసిందో తనలో అంతే పరిణతి చెందేలా కూడా చేసిందన్నారు. ఓవైపు భయంతో పాటు వాళ్లతో పోటీగా నటించాలనే కసి పట్టుదల మరింత పెంచాయన్నారు. అయితే అమీర్ ఖాన్ అందుకుంటోన్న వరుస క్లాసిక్ హిట్లు మిగతా హీరోలకంటే ఎక్కువగా తనని ఆందోళనకు గురి చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అమీర్ ఖాన్ ప్రేక్షకుల్లో పక్కింటి కుర్రాడిలో మారిపోయాడు.
అతడి నటనల, చలాకీతనం, చొచ్చుకుపోయే తత్వం నన్ను ఆకర్షించాయి. అలాగే మరింత అభద్రతా భావానికి గురి చేసాయన్నారు. అలా మొదలైన అమీర్ ఖాన్ కెరీర్ నేటికి ఎంతో గొప్పగా సాగుతుంది. అప్పట్లో అభద్రతా భావానికి గురైనా ఇప్పుడు అతడిని చూస్తే ఎంతో గర్వంగానూ అనిపిస్తుంది. నటుడిగా అమీర్ ఎంపిక చేసుకున్న కథలు, పాత్రలే అంత గొప్ప స్థానంలో కూర్చోబెట్టాయన్నారు.