Begin typing your search above and press return to search.

'దేవర'లో ఆ పాట... ఫ్యాన్స్ కి పండగ

సోషల్‌ మీడియాలో రెండు పాటలకూ వచ్చిన స్పందన తో ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీ అయ్యారు.

By:  Tupaki Desk   |   1 Oct 2024 12:53 PM GMT
దేవరలో ఆ పాట... ఫ్యాన్స్ కి పండగ
X

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సూపర్‌ హిట్‌ మూవీ దేవర ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. హీరోయిన్ గా జాన్వీ కపూర్‌ నటించిన ఈ సినిమాలో పాటలు చాలా తక్కువగా ఉన్నాయి. సినిమా విడుదలకు ముందే ఫియర్ సాంగ్ తో పాటు, ఎన్టీఆర్‌ - జాన్వీ కపూర్ ల కాంబోలో ఉండే చుట్టమల్లే, దావుడి సాంగ్ లను విడుదల చేయడం జరిగింది. చుట్టమల్లే సాంగ్‌ కి సూపర్‌ హిట్ టాక్‌ వచ్చింది. దావుడి పాటకి సైతం మంచి స్పందన వచ్చింది. సోషల్‌ మీడియాలో రెండు పాటలకూ వచ్చిన స్పందన తో ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీ అయ్యారు.

సినిమా విడుదల తర్వాత దేవర లో కేవలం చుట్టమల్లె సాంగ్ మాత్రమే ఉండటంతో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదేంటి ఇలా జరిగింది అని చాలా మంది అసహనం వ్యక్తం చేశారు. దావుడి పాట ఎందుకు లేదు అంటూ చాలా మంది చాలా రకాలుగా సోషల్‌ మీడియా ద్వారా చిత్ర యూనిట్‌ సభ్యులను ప్రశ్నించడం జరిగింది. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దసరా కానుకగా దేవర సినిమాలో దావుడి పాట ఉండబోతుందట. ఈ శుక్రవారం నుంచి ఆ పాటను థియేటర్‌ లో జత చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దావుడి పాటను రెండవ వారం లేదా మూడవ వారంలో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతోనే వాయిదా వేయడం జరిగిందట. సినిమాకు రెండో వారంలో రిపీట్ ఆడియన్స్ రావాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దేవర సినిమా కు దావుడి పాట జోడీ అయితే మరింతగా పాజిటివ్‌ స్పందన దక్కే అవకాశం ఉంది. ఉన్న ఒక్క రొమాంటిక్ సాంగ్‌ కి మంచి స్పందన వచ్చింది. అందుకే ఈ పాట కూడా జత కలిస్తే కచ్చితంగా ఫ్యాన్స్‌ కి కన్నుల పండుగ అన్నట్లుగా ఉంటుందని అంతా భావిస్తున్నారు.

ఎన్టీఆర్‌ దేవర సినిమా రికార్డ్‌ స్థాయి ఓపెనింగ్స్ ను రాబట్టింది. మొదటి మూడు రోజుల్లోనే అత్యధిక వసూళ్లు సాధించడం ద్వారా అరుదైన రికార్డ్‌ లు నమోదు అయ్యాయి అనే టాక్ వినిపిస్తుంది. దేవర సినిమా తో ఎన్టీఆర్‌ సోలోగా కెరీర్ బెస్ట్‌ రికార్డ్‌ లను నమోదు చేయడం జరిగింది. ఓవర్సీస్ లో విడుదలకు ముందే ఏకంగా మూడు మిలియన్ ల వసూళ్లు నమోదు చేసిన దేవర సినిమా లాంగ్ రన్‌ లో ఎంత వసూళ్లు చేస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నార్త్‌ ఇండియాలో ఏ స్థాయి లో సినిమా వసూళ్లు ఉంటాయి అనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.