Begin typing your search above and press return to search.

సినిమాటిక్ యూనివర్స్.. లెక్క పెరుగుతోంది..

ముఖ్యంగా సౌత్ యంగ్ డైరెక్టర్స్ సినిమాటిక్ యూనివర్స్ లో భిన్నమైన కథలని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   1 Jun 2024 10:30 AM GMT
సినిమాటిక్ యూనివర్స్.. లెక్క పెరుగుతోంది..
X

హాలీవుడ్ లో మార్వెల్ సిరీస్, ఎక్స్ మెన్, రెసిడెంట్ ఈవిల్ సిరీస్ ల తరహాలో భిన్నమైన కథలని ఒకే ప్లాట్ ఫామ్ మీదకి తీసుకొచ్చి చేస్తూ ఉంటారు. సినిమాటిక్ యూనివర్స్ అని క్రియేట్ చేసి అందులో వరుస మూవీస్ చేయడం హాలీవుడ్ లో ఎక్కువ మంది ఫాలో అయ్యే ఫార్ములా. ఇప్పుడు ఈ సినిమాటిక్ యూనివర్స్ కల్చర్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీలోకి కూడా వచ్చింది.

ముఖ్యంగా సౌత్ యంగ్ డైరెక్టర్స్ సినిమాటిక్ యూనివర్స్ లో భిన్నమైన కథలని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఖైదీ మూవీతో లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ చేశాడు. తన యూనివర్స్ లో విక్రమ్, లియో సినిమాలు చేశాడు. నాలుగో చిత్రంగా రజినీకాంత్ తో కూలీ చిత్రం చేస్తున్నారు.

ప్రశాంత్ వర్మ కూడా కేజీఎఫ్ సిరీస్ తో సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ చేశారు. అందులో సలార్ మూవీ చేశాడు. నెక్స్ట్ ఎన్టీఆర్ తో చేయబోయే చిత్రం కూడా ఈ యూనివర్స్ కథలలో భాగంగానే ఉంటుందంట. అలాగే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ చేసి సూపర్ హీరో కథలని చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇందులో ఇప్పటికే హనుమాన్ రిలీజ్ అయ్యింది.

జై హనుమాన్, బ్రహ్మ రాక్షస, అధీరా చిత్రాలు లైన్ అప్ లో ఉన్నాయి. రణ్ వీర్ తో చేస్తున్న బ్రహ్మ రాక్షసకు మళ్ళీ బ్రేకులు పడ్డ విషయం తెలిసిందే. కల్కి2898ఏడీ మూవీతో నాగ్ అశ్విన్ సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ చేశాడు. దీని తర్వాత ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ లతోనే కామిక్ టచ్ లో సూపర్ హీరో మూవీస్ చేయాలని అనుకుంటున్నారు. హిందీలో రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ క్రియేట్ చేసి పోలీస్ స్టోరీలతో మూవీస్ చేస్తున్నాడు. సింగం సిరీస్ ని కొనసాగిస్తున్నాడు.

లేడీ సింగం మూవీ కూడా తెరకెక్కించారు. అలాగే యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై థ్రిల్లర్ యూనివర్స్ క్రియేట్ చేసి అందులో మూవీస్ ని నిర్మిస్తోంది. వార్ 2 ఈ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే తెరకెక్కుతోంది. ఈ యూనివర్స్ కథలపై ఆడియన్స్ కూడా ఎక్కువ ఇంటరెస్ట్ చూపిస్తున్నారనేది వాటి సక్సెస్ రేట్ బట్టి చెప్పొచ్చు. ప్రతి సినిమాటిక్ యూనివర్స్ కి ఒక ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ అవుతోంది. భవిష్యత్తులో ఇంకెంత మంది దర్శకులు ఈ తరహాలో సినిమాటిక్ ప్రపంచంలోకి అడుగుపెడతారో అనేది కూడా ఇంటెస్టింగ్ ఫ్యాక్టర్ గా మారబోతోంది.