Begin typing your search above and press return to search.

సమంత సిటాడెల్.. వచ్చేది ఎప్పుడంటే..

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత సుదీర్ఘకాలంగా తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతోంది.

By:  Tupaki Desk   |   26 July 2024 3:01 PM GMT
సమంత సిటాడెల్.. వచ్చేది ఎప్పుడంటే..
X

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత సుదీర్ఘకాలంగా తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతోంది. ఆమె చివరిగా గత ఏడాది ఖుషి మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. సమంత ఆ మధ్య అస్వస్థత కారణంగా అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరింది. మాయోసైటిస్ బారిన పడినట్లు తరువాత సమంత ప్రకటించింది. దీనికి ఏడాది పాటు సమంత ట్రీట్మెంట్ తీసుకుంది.

ఈ సమస్య నుంచి బయటపడిన తర్వాత సమంత నుంచి యశోదా, శాకుంతలం, ఖుషి సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. గత ఏడాది ఖుషి సినిమా తర్వాత నటన నుంచి కొంత విరామం తీసుకుంటున్నట్లు సమంత ప్రకటించింది. శారీరకంగా, మానసికంగా రికవరీ అయ్యే ప్రయత్నం ఈ ఏడాదికాలం చేసింది. మరల ఈ అమ్మడు ఫిజికల్ గా, మెంటల్ గా ఫిట్ అయ్యి వెండితెరపై కనిపించడానికి సిద్ధమైంది.

అయితే తెలుగులో ఆశించిన స్థాయిలో సమంతకి అవకాశాలు రావడం లేదు. కొన్ని నెలల క్రితం ఆమె సొంతగా బ్యానర్ స్టార్ట్ చేసి మా ఇంటి బంగారం అనే సినిమా చేయబోతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ మూవీ ఏమైంది అనేది తరువాత ఎలాంటి అప్డేట్ లేదు. రీసెంట్ గా రాజ్ అండ్ డీకే నిర్మాణంలో రక్త బ్రహ్మాండం అనే వెబ్ సిరీస్ లో నటించడానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆగష్టు నుంచి ఈ వెబ్ సిరీస్ షూటింగ్ స్టార్ట్ అవుతుందంట. ఈ సిరీస్ లో ఆదిత్యరాయ్ కపూర్ హీరోగా చేస్తున్నారు.

ఇదిలా ఉంటే రాజ్ అండ్ డీకే ద్వయం దర్శకత్వంలో ది ఫ్యామిలీ మెన్ 2 తర్వాత సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ చేసింది. ఈ సిరీస్ షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ చేసుకుంది. అయితే రిలీజ్ పై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా చేసిన సిటాడెల్ వెబ్ సిరీస్ కి ఇది ఇండియన్ వెర్షన్. ఈ సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కి రంగం సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తోంది.

రాజ్ అండ్ డీకే ట్విట్టర్ లో 01.08 అనే డేట్ ని షేర్ చేసి దాని క్రింద తేనె డబ్బా, కుందేలు ఎమోజీలని పోస్ట్ చేశారు. దీనిని బట్టి ఆ రోజు సిటాడెల్ వెబ్ సిరీస్ రిలీజ్ చేయడం లేదంటే దానికి సంబంధించి కీలక అప్డేట్ ని అయిన ఇచ్చే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. ఈ సిటాడెల్ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్, సమంత జోడీగా నటించారు.