మాస్ మహారాజా కోసం 'క్లాస్ మహారాణి'
తాజాగా రవితేజ సరసన కథానాయికను ఫైనల్ చేస్తూ అధికారిక ప్రకటన చేసారు. రవితేజ - హరీష్ శంకర్ సినిమా కోసం భాగ్యశ్రీ బోర్స్ కథానాయికగా ఎంపికైంది.
By: Tupaki Desk | 16 Dec 2023 4:47 PM GMTరాబోవు ఎన్నికలలోపు ఉస్తాద్ భగత్ సింగ్‌ని పూర్తి చేయాలని దర్శకుడు హరీష్ శంకర్ ప్లాన్ చేసారు. కానీ అనుకున్నది జరగలేదు. కథానాయకుడు పవన్ కళ్యాణ్ అందుబాటులో లేకపోవడంతో సినిమా ఆలస్యమైంది. 'ఉస్తాద్ భగత్‌సింగ్' తర్వాత రవితేజ ప్రాజెక్ట్‌కి హరీష్ శంకర్ షిఫ్టయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్, కాస్టింగ్ ఎంపికలు వేగంగా పూర్తవుతున్నాయి.
తాజాగా రవితేజ సరసన కథానాయికను ఫైనల్ చేస్తూ అధికారిక ప్రకటన చేసారు. రవితేజ - హరీష్ శంకర్ సినిమా కోసం భాగ్యశ్రీ బోర్స్ కథానాయికగా ఎంపికైంది. భాగ్యశ్రీ బోర్సే పోస్టర్ ని రిలీజ్ చేసారు. హీరోయిన్‌ని పరిచయం చేస్తూ మాస్ మహారాజా రవితేజకు 'క్లాస్ మహారాణి' అంటూ హరీష్ తనదైన మార్క్ చతురతను ప్రదర్శించాడు. భాగ్యశ్రీ పేరుకు తగ్గట్టే చీరలో అందంగా కవ్విస్తోంది. ఎంతో స్పెషల్ గా ఉన్న ఈ భామ మాస్ రాజాకు పెద్ద ప్లస్ కానుందనడంలో సందేహం లేదు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రవితేజ నటించిన గత చిత్రం టైగర్ నాగేశ్వరరావు ఆశించిన స్థాయి విజయం సాధించలేదు. ఇక అతడు నటిస్తున్న ఇటీవలి చిత్రాల్లో కొత్త కథానాయికలను పరిచయం చేస్తున్నాడు. కొత్త ట్యాలెంటును ప్రభావవంతంగా సద్వినియోగం చేయడంలో రాజా ఎప్పుడూ ముందుంటారు! తదుపరి చిత్రంలో భాగ్యశ్రీ బోర్స్ ని ఈ అవకాశం వరించింది.