Begin typing your search above and press return to search.

CM రేవంత్ రెడ్డి టీష‌ర్ట్ ధ‌ర‌ 50 వేలు?

అన్ని ప‌రిశ్ర‌మ‌ల‌తో స‌ద్భావ‌న‌ను క‌లిగి ఉన్న ముఖ్య‌మంత్రిగా రేవంత్ దూసుకుపోతున్నారు.

By:  Tupaki Desk   |   30 July 2024 4:11 PM GMT
CM రేవంత్ రెడ్డి టీష‌ర్ట్ ధ‌ర‌ 50 వేలు?
X

ఫైర్ బ్రాండ్ గా పాపులారిటీ ఉన్న తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి త‌న ప్రామిస్ ల‌ను నిల‌బెట్టుకునేందుకు ప్ర‌జ‌ల కోసం చేయాల్సిన‌దంతా చేస్తున్నారు. తాజాగా తెలంగాణ‌ రైతుల‌ రుణ‌మాఫీ కోసం రూ.6000 కోట్లు వెచ్చించి రైత‌న్న‌ల క‌న్నీళ్ల‌ను తుడిచిన సీఎంగా జేజేలు అందుకుంటున్నారు. ముఖ్య‌మంత్రిగా ఆయ‌న త‌న‌దైన మార్క్ పాల‌న‌తో దూసుకుపోతున్నారు. ఇంత‌కుముందే గ‌ద్ద‌ర్ పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం పుర‌స్కారాల‌ను ఇవ్వాల‌నుకుంటున్న‌ట్టు సీఎం రేవంత్ ప్ర‌క‌టించ‌గా, దానికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పందించి వెంట‌నే ఇది వెంట‌నే జ‌ర‌గాల‌ని కోరుకున్నారు. సీఎంని అభినందించారు. అన్ని ప‌రిశ్ర‌మ‌ల‌తో స‌ద్భావ‌న‌ను క‌లిగి ఉన్న ముఖ్య‌మంత్రిగా రేవంత్ దూసుకుపోతున్నారు.


అయితే ఆయ‌న రాజ‌కీయాల్లో ఎలా ఉన్నా వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న సున్నిత మ‌న‌స్త‌త్వం, స్టైల్ స్టేట్ మెంట్ అభిమానుల‌ను అన్నివేళ‌లా ఆక‌ర్షిస్తూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఫ్యాషన్ సెన్స్‌ను వీలున్న ప్ర‌తి వేదిక‌పైనా చాటుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇంత‌లోనే సీనియర్ నటుడు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డిని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌ల‌వ‌డానికి హైద‌రాబాద్ కి విచ్చేసారు. ఈ సంద‌ర్భంగా రేవంత్- అర్జున్ జోడీ కెమెరాకు పోజులిచ్చిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే సినీ హీరో అర్జున్ ఎంత స్టైలిష్ గా క‌నిపిస్తారో అంత‌కుమించి సీఎం రేవంత్ రెడ్డి స్టైలిష్ గా క‌నిపించారు. 50 వ‌య‌సులోను ఆయ‌న యువ‌కుడిలా క‌నిపిస్తున్నారు. అంతేకాదు ఆయ‌న‌ వేసుకున్న టీషర్ట్ నెటిజనుల్లో చ‌ర్చ‌కు తావిచ్చింది. ఇది ఏ బ్రాండ్? వెల ఎంత‌? అంటూ ఆన్ లైన్ లో వెత‌క‌డం ప్రారంభించారు. దీంతో ఆ బ్రాండ్ కి ఒక్క‌సారిగా ఇమేజ్ పెరిగిపోయింది.

ఇంత‌కీ రేవంత్ ధ‌రించిన టీష‌ర్ట్ బ్రాండ్ ఏమిటి? అంటే.. రేవంత్ రెడ్డి బాల్‌మైన్ ప్యారిస్ లాంగ్ స్లీవ్ టీషర్ట్ ధరించి కనిపించారు. ఈ టీ షర్ట్ ధ‌ర‌ దాదాపు రూ.50,000-60,000 మ‌ధ్య ఉంటుంద‌ని అంచ‌నా. ఆన్ లైన్ ధ‌ర 600 - 700 డాల‌ర్ల మ‌ధ్య చూపిస్తోంది. అంత‌ర్జాతీయ బ్రాండ్ కాబ‌ట్టి దానికి త‌గ్గ‌ట్టు ధ‌ర ట్యాగ్ ఉంటుంది. ఇక అర్జున్ సైతం నైక్ బ్రాండ్ టీష‌ర్ట్- డెనిమ్ జీన్స్ లో స్మార్ట్ గా క‌నిపించాడు.

రేవంత్ రెడ్డి తన రాజకీయ జీవితంలో ధోతీలు క‌ట్ట‌లేదు. వైట్ అండ్ వైట్ దుస్తులు ధరించలేదు. ఆయ‌న ఒకే ఒక్క‌డు అర్జున్‌లా ఆఫీస్‌కి ఫార్మ‌ల్ గా వ‌స్తుంటారు. కొన్నిసార్లు సింపుల్ గా టీ-షర్టు లేదా సాధారణ దుస్తులు ధరించి క‌నిపిస్తుంటారు. స్టార్ హీరో అర్జున్ తో రేవంత్ మీటింగ్ ఎంత ఆస‌క్తిని క‌లిగించిందో, అంత‌కుమించి రేవంత్ ధ‌రించిన టీష‌ర్ట్ నెటిజ‌నుల్లో ఆస‌క్తిని క‌లిగించింది. దీంతో అదే బ్రాండ్ టీష‌ర్ట్ ని కొనుగోలు చేసేందుకు యూత్ పోటీప‌డుతున్నారు. ఆన్ లైన్ లో ఇప్ప‌టికే చాలా ఆర్డ‌ర్స్ వెళ్లాయి. తెలంగాణ వ్యాప్తంగా యూత్ ఈ టీష‌ర్ట్ కోసం ఆన్ లైన్ లో వెతుకుతున్నారు.