అరిగిపోయిన కేసెట్టులా కరణ్ కాఫీ షో
ఇదంతా మారిన ట్రెండ్.. ఇప్పుడు కరణ్ జోహార్ లాంటి హోస్ట్ దీని నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందనేది ఒక సెక్షన్ విశ్లేషకుల వాదన.
By: Tupaki Desk | 17 Nov 2023 5:36 AM GMTరొటీన్ కథలతో సినిమాలు తీస్తే ప్రజలు నిరభ్యంతరంగా తిరస్కరిస్తున్నారు. రెగ్యులర్ కమర్షియల్ కంటెంట్ కి ఆదరణ తగ్గింది. ప్రయోగాత్మక సినిమాలు, వైవిధ్యం ఉన్న కంటెంట్ ని మాత్రమే ప్రజలు ఆదరిస్తున్నారు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, నేరేషన్ వగైరా చాలా కావాలి. ఇది టీవీ పరిశ్రమకు లేదా ఓటీటీ పరిశ్రమకు కూడా వర్తిస్తుంది. అయితే ఓటీటీల్లో చాలా ఎక్కువగా ప్రయోగాలకు ఆస్కారం ఉంది గనుక వీటికి ఆదరణ కూడా పెరుగుతోంది.
ఇదంతా మారిన ట్రెండ్.. ఇప్పుడు కరణ్ జోహార్ లాంటి హోస్ట్ దీని నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందనేది ఒక సెక్షన్ విశ్లేషకుల వాదన. దానికి కారణం ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న కాఫీ విత్ కరణ్ 8 సీజన్ 8 పూర్తిగా ఫెయిలవ్వడమే. రొటీన్ గాసిప్పుల గురించి ఈ వేదికపై ప్రస్థావించడం, బెడ్ రూమ్ విషయాలను రాబట్టడం లేదా డేటింగుల గురించి పరిశోధించడం వగైరా ఇప్పుడు ఆసక్తిని పెంచడం లేదు. ప్రజలకు అంతకుమించి ఇంకేదో కావాలి. రొటీన్ ప్రశ్నలతో విసిగించకుండా షోని క్రియేటివ్ గా మార్చాల్సి ఉందని కూడా సూచిస్తున్నారు.
కాఫీ విత్ కరణ్ తాజా ఎపిసోడ్‌లో కరీన్ కపూర్ ఖాన్- అలియా భట్ షోకు అతిథులు. పెళ్లయిన మామ్ లు ఇద్దరితో కరణ్ ఏం మసాలా అద్దగలడు? అంటూ ముందే సందేహాలు ఎక్కువయ్యాయి. దానికి తగ్గట్టే కరణ్ ఈ ఎపిసోడ్ ని బిగ్ ఫ్లాప్ చేసాడు. పిల్లలు, పేరెంటింగ్.. అందం, జీవనశైలి వంటి రొటీన్ విషయాలను ఆయన అడిగారు. నిజానికి ఇలాంటివన్నీ నేటితరం ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి. ఎందుకంటే అలియా - కరీనా చెప్పినవి ఏవీ కొత్తవి కావు. వార్తాపత్రికలు సహా యూట్యూబ్ చానెళ్లలో చూసేసినవే.
సారా అలీ ఖాన్ - అనన్య పాండేలు ఎపిసోడ్ లోను రొటీన్ గా డేటింగ్ ల గురించి బోయ్ ఫ్రెండ్స్ గురించి కరణ్ అడిగాడు. అవి అప్పటికే అరిగిపోయిన కేసెట్టు! రొటీన్ ప్రశ్నలతో గత వారం ఎపిసోడ్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఎందుకంటే వారు చాలా ఇతర ఇంటర్వ్యూలలో కూడా ఆ విషయాలన్నీ చెప్పారు. కరణ్ జోహార్ కొత్తగా ప్రశ్నించేందుకు ఏదీ లేదు. మసాలా అద్దేందుకు అసలు విషయం వారి జీవితాల్లో ఇక లేనట్టే. ర్యాపిడ్ ఫైర్ కానీ ఇతర ఏ విభాగంలోను కొత్తదనం కనిపించలేదు. అందుకే ప్రజలు పూర్తిగా బోరింగ్ ఫీలయ్యారు. కాఫీ విత్ కరణ్ 8 ఇప్పటివరకూ ఫెయిలైందనే చెప్పాలి