కోలా బ్రాండ్: చిరంజీవి నుంచి అల్లు అర్జున్ వరకూ
తెలుగు చిత్రసీమలో దిగ్గజ హీరోలతో కాంట్రాక్టులు కుదుర్చుకుని ప్రచారం చేసుకోవడంలో ప్రముఖ కోలా బ్రాండ్ నైపుణ్యం గురించి చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 2 Feb 2025 4:47 PM GMTతెలుగు చిత్రసీమలో దిగ్గజ హీరోలతో కాంట్రాక్టులు కుదుర్చుకుని ప్రచారం చేసుకోవడంలో ప్రముఖ కోలా బ్రాండ్ నైపుణ్యం గురించి చర్చ సాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ మొదలు, నేటి ట్రెండింగ్ స్టార్ అల్లు అర్జున్ వరకూ ఈ బ్రాండ్ కాంట్రాక్టులు కుదుర్చుకుని తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ చేసింది. కోట్లాది రూపాయల విలువ చేసే కాంట్రాక్టులకు సంతకాలు చేసిన స్టార్లకు ఇది మంచి ఆదాయ మార్గం కాగా, సదరు బ్రాండ్ పాపులారిటీ కూడా చుక్కల్ని తాకింది.
నిజానికి మెగా కాంపౌండ్ హీరోలను కాదనుకుంటే, ఆ తర్వాత ఆప్షన్ గా సూపర్ స్టార్ హహేష్ బాబు, విజయ్ దేవరకొండతోను సదరు కోలా కంపెనీ ప్రమోషన్ చేయించుకుంది. ఏడాది రెండేళ్ల పాటు లేదా క్రేజ్ ఉన్నంత కాలం స్టార్లను కొనసాగించడం, ఆ తర్వాత కొత్త స్టార్ ని ఎంపిక చేయడం ఈ కోలా బ్రాండ్ ప్రత్యేకత. ఒక ప్రముఖ బాలీవుడ్ స్టార్ తో హిందీ బెల్ట్ లో ప్రకటన షూట్ చేయడం, ప్రముఖ తెలుగు స్టార్ తో తెలుగు రాష్ట్రాల్లో ప్రకటన రూపొందించి ప్రచారం చేయంచుకునే సదరు బ్రాండ్ కోలీవుడ్ శాండల్వుడ్ హీరోలతోను ప్రకటనలు తయారు చేసి పొరుగు భాషల్లోను వదులుతుంది. ఈ ప్రచారార్భాటంతో కోలా బ్రాండ్ ఆయా రాష్ట్రాల్లో భారీ బిజినెస్ చేస్తుంది. ప్రజల నుంచి కోట్లాది రూపాయల ఆర్జనను కళ్ల జూడటంతో కోలా బ్రాండ్ ప్రతిసారీ క్రేజ్ ఉన్న హీరోల కోసం వెతుకుతుంది.
ఇప్పుడు విజయ్ దేవరకొండ స్థానంలో అల్లు అర్జున్ ని నియమించుకుంది. పుష్ప, పుష్ప 2 చిత్రాలతో అతడి పేరు వరల్డ్ వైడ్ మార్మోగుతోంది. భారతదేశంలో క్రేజీ స్టార్ హీరోలలో ఒకరిగా మారాడు బన్ని. పాన్ ఇండియా మార్కెట్ అతడి చేతికి చిక్కింది. దీంతో క్రేజ్ ఉన్న అల్లు హీరో ఇతరులను రీప్లేస్ చేస్తున్నాడు. మెగా ఫ్యామిలీ హీరోలతోను సదరు కోలా బ్రాండ్ చాలా కాలం ప్రచార కాంట్రాక్టులను కుదుర్చుకుంది. చిరంజీవి, పవన్ కల్యాణ్ (కెరీర్ ఆరంభంలో పెప్సీకి ఒకేసారి ప్రచారం చేసారు), రామ్ చరణ్ లతో సదరు కోలాబ్రాండ్ ప్రచారం నిర్వహించింది. ఇప్పుడు అదే మెగా కాంపౌండ్ హీరోగా అల్లు అర్జున్ కి అవకాశం దక్కింది.
యువత సహా ప్రజల్లో భారీ అభిమానులను కలిగి ఉన్న స్టార్లను సాధారణంగా ఆకర్షించే కోలా బ్రాండ్లు అల్లు అర్జున్ వెంట పడటంలో ఆశ్చర్యం లేదు. ఇటీవల దేవరకొండ హవా తగ్గింది. సక్సెస్ లేకపోవడంతో ఇప్పుడు బ్రాండ్ అల్లు అర్జున్ వెంట పడుతోంది.