Begin typing your search above and press return to search.

'మా కోసం కూడా స్పెషల్ షోస్ వేయండి'

తాజాగా కలెక్టర్లు.. తమ కోసం తెలుగు కొత్త సినిమాల స్పెషల్ షోలు వేయాలని కోరారు. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ కు వినతి పత్రాన్ని పంపారు.

By:  Tupaki Desk   |   30 Nov 2024 10:02 AM GMT
మా కోసం కూడా స్పెషల్ షోస్ వేయండి
X

స్పెషల్ షోస్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఈ పదం వినిపిస్తూనే ఉంటుంది. పలు చిత్రాల మేకర్స్.. వివిధ సందర్భాల్లో స్పెషల్ షోలు వేయడాన్ని చూస్తూ ఉంటాం. కొన్ని సార్లు ఉచితంగా కూడా తమ సినిమాలను చూపిస్తుంటారు. మరికొన్నిసార్లు పెయిడ్ ప్రీమియర్స్ రూపంలో స్పెషల్ షోలు ప్రదర్శిస్తుంటారు.

తాజాగా కలెక్టర్లు.. తమ కోసం తెలుగు కొత్త సినిమాల స్పెషల్ షోలు వేయాలని కోరారు. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ కు వినతి పత్రాన్ని పంపారు. ప్రతి శనివారం/ ఆదివారం స్పెషల్ షోస్ ఏర్పాటు చేయాలని కోరారు. తమతో పాటు కుటుంబ సభ్యులే వస్తారని వెల్లడించారు. అసలేం జరిగింది? ఎవరు లేఖ రాశారు?

వాస్తవానికి.. సినిమా చూడటాన్ని పెద్ద రిలాక్సేషన్ గా చాలా మంది భావిస్తుంటారు. అందుకే తమకు వీలు దొరికినప్పుడల్లా అనేక మంది థియేటర్లలో చూస్తుంటారు. అయితే ఎప్పుడూ ప్రభుత్వ విధుల్లో బిజీ బిజీగా ఉండే ఐఏఎస్ అధికారులు కూడా తమ కుటుంబాలతో సినిమాలు చూసి ఎంజాయ్ చేద్దామని అనుకుంటారు.

కానీ భద్రతతో పాటు గోప్యతను కాపాడుకునే విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అందుకే అందరిలా ఫ్రీగా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడలేరు! దీంతో తమకు ఉన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని విజయవాడలోని ఐఏఎస్‌ అధికారుల సంఘం ఇప్పటికే చిన్నపాటి ప్రైవేట్‌ సినిమా థియేటర్‌ ను నిర్మించింది.

విజయవాడ బెంజ్ సర్కిల్ లో ఉన్న ఆ థియేటర్ లో 48 మంది ఒకేసారి సినిమా చూడవచ్చు. దీంతో అక్కడికి వెళ్లి మూవీస్ చూస్తుంటారు కొందరు ఐఏఎస్ ల కుటుంబ సభ్యులు. ఇప్పుడు ఆ మినీ థియేటర్ లో కొత్త సినిమాల స్పెషల్ షోస్ వేయాలని టాలీవుడ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ తో పాటు ఫిల్మ్ ఛాంబర్ ను కోరారు విజయవాడలోని ఐఏఎస్ ల సంఘం ప్రతినిధులు.

వీకెండ్స్ లో ప్రత్యేక ప్రదర్శనలు వేసి తమతో పాటు తమ కుటుంబాలకు ఏర్పాట్లు చేయాలని లేఖలో రీసెంట్ గా కోరారు. అయితే కలెక్టర్ల స్పెషల్ రిక్వెస్ట్ పై ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంటుంది. మరి ఈ విషయంపై ఎవరైనా స్పందిస్తారో వేచి చూడాలి.