బ్రహ్మానందం ఆస్తుల విలువెంతో తెలుసా?
టాలీవుడ్ లో హాస్యబ్రహ్మగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్రహ్మానందం గురించి మళ్లీ స్పెషల్ గా పరిచయం చేయనక్కర్లేదు.
By: Tupaki Desk | 2 Feb 2025 9:30 PM GMTటాలీవుడ్ లో హాస్యబ్రహ్మగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్రహ్మానందం గురించి మళ్లీ స్పెషల్ గా పరిచయం చేయనక్కర్లేదు. తెలుగులోనే కాకుండా ఇండియా మొత్తమ్మీద స్టార్ హీరోలతో సమానంగా భారీ పాపులారిటీ అందుకున్న కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు బ్రహ్మి. దేశంలోనే ఖరీదైన కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు బ్రహ్మానందం.
సుమారు 1200కి పైగా సినిమాల్లో నటించిన కామెడీ కింగ్ గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకున్నాడు. సినిమాల ద్వారా బ్రహ్మానందం చాలానే సంపాదించాడు. సినిమాల ద్వారా సంపాదించిన దాన్ని రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిగా పెట్టి, ఇప్పుడు వందల కోట్ల ఆస్తికి అధిపతయ్యాడు. బ్రహ్మానందం సినిమాలో నటించాలంటే రోజుకు 1 లక్ష నుంచి 4 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడు.
వయసు మీద పడటంతో ఆచితూచి సినిమాలు చేస్తున్న బ్రహ్మీ కెరీర్ స్టార్టింగ్ లో చిరంజీవి, రామా నాయుడు ప్రోత్సాహంతో ఎక్కువ సినిమాలు చేశాడు. స్క్రీన్ మీద ఆయన కనిపించాడంటే ఆడియన్స్ పొట్ట చెక్కలవ్వడం ఖాయం. ఇదిలా ఉంటే బ్రహ్మానందం ఇప్పటివరకు సుమారు రూ.800 కోట్లకు పైగా ఆస్తి కూడబెట్టినట్టు సమాచారం.
ఇంకా చెప్పాలంటే ఎన్నో సినిమాలు చేసిన స్టార్ హీరోలు కూడా ఇంత మొత్తంలో ఆస్తి కూడబెట్టలేదని చెప్పొచ్చు. ఇక బ్రహ్మానందం దగ్గర లగ్జరీ కార్లు ఎన్నో ఉన్నాయి. ఆడి ఆర్8, ఆడి క్యూ7, బ్లాక్ లగ్జరీ మెర్సిడెస్ బెంజ్ లాంటి కార్లతో పాటూ ఎన్నో కంపెనీల కార్లు ఆయన దగ్గర ఉన్నాయి.