Begin typing your search above and press return to search.

డబుల్ ఇస్మార్ట్ లో అతని మ్యాజిక్ రిపీట్..!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పూరీ జగన్నాథ్ ఈ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ గా నిలిచింది.

By:  Tupaki Desk   |   31 July 2024 10:11 AM GMT
డబుల్ ఇస్మార్ట్ లో అతని మ్యాజిక్ రిపీట్..!
X

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పూరీ జగన్నాథ్ ఈ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ గా నిలిచింది. ఐతే ఆ సినిమా తర్వాత రామ్ వరుస సినిమాలు చేస్తున్నా ఏది అంతగా వర్క్ అవుట్ కాలేదు. పూరీ కూడా లైగర్ అంటూ ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేసినా అది కూడా డిజాస్టర్ అయ్యింది. ఐతే మళ్లీ రాం పూరీనే కలిసి ఇస్మార్ట్ శంకర్ రీమేక్ గా డబుల్ ఇస్మార్ట్ చేశారు. ఆగష్టు 15న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. సినిమా ఫస్ట్ కాపీ చూసుకున్న పూరీ అండ్ టీం సూపర్ సాటిస్ఫైడ్ గా ఉన్నారట.

రాం తో ఢీ కొట్టేందుకు బాలీవుడ్ యాక్షన్ స్టార్ సంజయ్ దత్ ని రంగంలోకి దించాడు పూరీ జగన్నాథ్. ఈమధ్య సౌత్ సినిమాల్లో బాలీవుడ్ స్టార్స్ హడావిడి ఎక్కువైంది. ఆల్రెడీ K.G.F 2 లో సంజయ్ దత్ అదరగొట్టగా ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ లో కూడా సంజయ్ మార్క్ కనిపించేలా చేస్తున్నారట. ఐతే ఈ సినిమాలో మరో సర్ ప్రైజ్ ఏంటంటే పూరీ ఆఫ్టర్ గ్యాప్ స్టార్ కమెడియన్ అలితో పనిచేశారు.

సినిమాలో అలికి సెపరేట్ ట్రాక్ ఉంటుందని తెలుస్తుంది. ఒకప్పుడు పూరీ సినిమా అంటే చాలు అలికి ఒక ప్రత్యేకమైన ట్రాక్ దాన్ని సినిమాలోకి కలుపుతూ సూపర్ గా ప్లాన్ చేశాడు. కానీ పూరీ ఈమధ్య అలిని పక్కన పెట్టాడు. ఐతే డబుల్ ఇస్మార్ట్ కోసం మళ్లీ అలికి ఒక డిఫరెంట్ రోల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈమధ్య కాలంలో అలి కూడా సినిమాల పరంగా అలి జోరు తగ్గింది. అందుకే పూరీ ఇచ్చిన పాత్రకు పర్ఫెక్ట్ గా న్యాయం చేస్తూ అలి మరోసారి తన మ్యాజిక్ రిపీట్ చేశాడని అంటున్నారు. పూరీ సినిమాల్లో అలి డిఫరెంట్ రోల్స్ తో మెప్పించిన సందర్భాలు ఉన్నాయి. డబుల్ ఇస్మార్ట్ లో కూడా అటు యాక్షన్ అంశాలతో పాటుగా అలి కామెడీ కూడా అదిరిపోతుందని అంటున్నారు.

డబుల్ ఇస్మార్ట్ సినిమా విషయంలో పూరీ కాలిక్యులేషన్స్ ఎక్కడ తగ్గకుండా ప్లాన్ చేశాడని తెలుస్తుంది. సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించగా మణిశర్మ అందించిన మ్యూజిక్ కూడా సినిమాపై బజ్ పెంచేలా చేస్తుంది. మరి ఆగష్టు 15న వస్తున్న ఈ డబుల్ ఇస్మార్ట్ సత్తా చాటుతాడా లేదా అన్నది చూడాలి. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు పూరీ జగన్నాథ్.