ఐఐటీ ఖరగ్ పూర్ స్టార్ ఇప్పుడు కామెడీ స్టార్
దేశంలోనే అత్యున్నత ఐఐటీ గా పేరున్న ఐఐటీ ఖరగ్ పూర్ నుండి డిగ్రీ పొంది నెల నెల లక్షల రూపాయల సంపాదన కలిగిన వ్యక్తి సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు అంటే ఆశ్చర్యం కలగక మానదు.
By: Tupaki Desk | 25 July 2023 2:45 AM GMTసినిమా ఇండస్ట్రీ గురించి ఒకప్పుడు ఒక టాక్ ఉండేది... అదేంటి అంటే చదువు ఎక్కువగా రాని వారు... బాగా డబ్బు ఉన్న వారు మాత్రమే సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసే వారు. సినిమా ఇండస్ట్రీలో రాణించిన వారిలో తక్కువ చదువుకున్న వారే ఎక్కువ మంది ఉండటం వల్ల చాలా మంది అది వాస్తవం అనుకుంటారు. కానీ చాలా మంది బాగా చదువుకున్న వారు కూడా ఇండస్ట్రీ లో ఉన్నారు.
ముఖ్యంగా దర్శకుల్లో బాగా చదువుకున్న విద్యావంతులు ఉన్న విషయం తెల్సిందే. నటీ నటుల్లో కొంత మంది సరిగా చదువుకోని వారు ఉంటే.. కొంత మంది చదువుకున్న వారు ఉంటారు. దేశంలోనే అత్యున్నత ఐఐటీ గా పేరున్న ఐఐటీ ఖరగ్ పూర్ నుండి డిగ్రీ పొంది నెల నెల లక్షల రూపాయల సంపాదన కలిగిన వ్యక్తి సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు అంటే ఆశ్చర్యం కలగక మానదు.
లక్షల ఉద్యోగం వదిలి హీరోగానో... ఏ డైరెక్టర్ గానే ఎంట్రీ ఇస్తే పర్వాలేదు కానీ ఒక కమెడియన్ గా ఎంట్రీ ఇవ్వడం అందరికీ షాకింగ్ గా ఉంది. ఆ ఐఐటీ ఖరగ్ పూర్ స్టార్ విషయానికి వస్తే బిశ్వ కళ్యాణ్ రాత్. ఇతడు 2012 సంవత్సరంలో ఐఐటీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కొన్నాళ్లు భారీ మొత్తంలో సాలరీ తీసుకుంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగంను చేశాడు. కానీ అతడికి కామెడీ పై ఆసక్తితో ఉద్యోగం వదిలేశాడు.
కన్నన్ గిల్ ను కలిసిన తర్వాత 2014 లో ఉద్యోగాన్ని వదిలేసి కామెడీ కార్యక్రమాలపై దృష్టి పెట్టాడు. స్టాండప్ కామెడీ చేయడం ద్వారా ట్రెండ్ సెట్ చేశాడు. సినిమాల్లో నటిస్తూ... సిరీస్ ల్లో నటిస్తూ స్టార్ కమెడియన్ గా మారాడు. లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి ఎలా ఇండస్ట్రీకి వెళ్తావు అని ప్రశ్నించిన వారికి సమాధానం ఇచ్చాడు.
ఒకప్పుడు బిశ్వ కళ్యాణ్ రాత్ ఆస్తి 15 నుండి 20 లక్షల రూపాయలు ఉండేది. కానీ ఇప్పుడు ఇతగాడి ఆస్తి కోటి రూపాయలకు చేరుకుంది. ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ద్వారా బాగా పాపులారిటీని సొంతం చేసుకోవడంతో పాటు స్టేజ్ షో లు చేస్తూ మంచి ఇమేజ్ ను రాబట్టుకున్నాడు. అందుకే ఇప్పుడు కామెడీ స్టార్ గా నిలిచి పోయాడు. ఐఐటీ ఖరగ్ పూర్ స్టార్ కాస్త ఇప్పుడు కామెడీ స్టార్ అవ్వడం ఆశ్చర్యాన్ని కలిగించడంతో పాటు అతడి పట్టుదలకు.. అతని పై అతనికి ఉన్న నమ్మకంకు హ్యాట్సాప్ చెప్పకుండా ఉండలేం.