అతని చేతిలో కోట్ల విలువైన బంగ్లా..ఇదెలా సాధ్యం?
సోషల్ మీడియా ఇప్పుడు గొప్ప ఆదయ వనరుగా మారిన సంగతి తెలిసిందే. యూ ట్యూబ్..ఇన్ స్టా వంటి మాధ్యమాల ద్వారా కోట్లలో సంపాదిస్తున్న వారెంతో మంది.
By: Tupaki Desk | 13 Jan 2024 12:30 AM GMTసోషల్ మీడియా ఇప్పుడు గొప్ప ఆదయ వనరుగా మారిన సంగతి తెలిసిందే. యూ ట్యూబ్..ఇన్ స్టా వంటి మాధ్యమాల ద్వారా కోట్లలో సంపాదిస్తున్న వారెంతో మంది. కేవలం సోషల్ మీడియాతోనే పాపులర్ అయి సెలబ్రిటీలైన వారు...కోట్లల ఆదాయం చూస్తున్న వారెంతో మంది ఉన్నారు. తాజాగా యూ ట్యూబర్ కమ్ కమెడియన్ భువన్ బామ్ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసాడు. గుజరాత్ కి చెందిన భువన బామ్ ఢిల్లీ విలాసవంతమైన బగ్లా కొన్నట్లు తెలుస్తుంది.
దీని విలువ 11 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ అనే ప్రాంతాంలో ఈ బంగ్లా ఉంది. ఇతడి ప్రధాన ఆదాయం యూట్యూబ్. బీబికి వైన్స్ అనే యూట్యూబ్ ఛానెల్ ఉంది. యూ ట్యూబ్ వీడియోలతోనే అతను ఎక్కువగా పాపులర్ అయ్యాడు. 2015 లోయూ ట్యూబ్ ఛానెల్ ని ప్రారంభించాడు. 26.4 మిలియన్లకు పైగా సబ్ స్క్రైబర్లు ఉన్నారు. అతని టార్గెట్ హాస్య ప్రియులు. కామెడీ కంటెంట్ ని ఎక్కువగా పోస్ట్ చేస్తుంటాడు.
ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లోనే ఆహాస్యాన్ని అల్లడం అతని ప్రత్యేకత. అలాగే భువన్ మ్యూజిక్ వరల్డ్ లో కి కూడా అడుగు పెట్టాడు. ఇప్పటికే చాలా పాటలు కూడా రిలీజ్ చేసాడు. అలాగే `దిండోరా`..`రాప్తా రాప్తా`.. `ఖబర్` వంటి వెబ్ సిరీస్ ల్లోనూ నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. జపనీస్ గేమ్ షో `తకేషిస్ కాజిల్` కి కామెంటర్ గాను వ్యవహరిస్తున్నాడు. ఇంకా అంతర్జాతీయంగా పాపులర్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా 11 కోట్ల విలువైన బంగ్లా కొనడంతో నెట్టింట సంచలనమవుతున్నాడు.
కెరీర్ ని ఎంతో చిన్న గా మొదలు పెట్టి నేడు కోట్లకి పడగ ఎత్తడం అంటే చిన్న విషయం కాదు. సాధారణంగా ఇది కేవలం గ్లామర్ ఫీల్డ్ లోనే సాధ్యమవుతుంది. కానీ యూ ట్యూబ్ వంటి మాధ్యమాలు వచ్చాక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాల్ని తమ వీడియో లతో మెప్పిస్తూ కోట్ల రూపాయల ఆదాయం చూస్తున్నారు. సొంతంగా ఉపాధిని సృష్టించుకుంటున్నారు. అందులోనూ భారతీయులు ముందు వరుసలో ఉండటం విశేషం.