స్టార్ కమెడియన్‌ని నాశనం చేసిన అహం?
తమిళ కమెడియన్ వడివేలు ప్రేమదేశం, రన్ లాంటి సినిమాలతో తెలుగు నాటా భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు
By: Tupaki Desk | 9 Jan 2024 11:30 AM GMTతమిళ కమెడియన్ వడివేలు ప్రేమదేశం, రన్ లాంటి సినిమాలతో తెలుగు నాటా భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. బ్రహ్మీ కామెడీని ఎంతగా ఎంజాయ్ చేస్తారో వడివేలు కామెడీని అంతే ఇదిగా ఆస్వాధిస్తారు తెలుగు ప్రేక్షకులు. 90ల నుంచి రెండు దశాబ్ధాలు పైగానే వడివేలు హవా సాగింది. కమెడియన్లలో సూపర్ స్టార్ అతడు. అయితే అతడి గ్రాఫ్ ఉన్నట్టుండి కిందికి పడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అతడి అహం, సూపర్ స్టార్ రజనీకాంత్ తో గొడవ కారణంగా గ్రాఫ్ పడిపోయిందని చాలా మంది చెబుతుంటారు.
సినీ రంగంలో అత్యంత డిమాండ్ ఉన్న హాస్యనటుడు అనే అహంకారం కారణంగా తన కెరీర్‌ను తనకు తానుగానే నాశనం చేసుకుని ఒంటరివాడయ్యాడని గుసగుసలు ఉన్నాయి. అతని సమకాలీనుడైన వివేక్ జీవితంలో చాలా జాగ్రత్తగా, తక్కువ అహంభావంతో ఉంటాడు. అతడు వడివేలుతో సమానంగా సినిమాలు చేసాడు. కామెడి జోడీగా చాలా సినిమాలలో కలిసి పనిచేశారు. వడివేలు ఉన్న సమయంలోనే వివేక్ పాపులారిటీ బాగా పెరిగింది. నేటితరం హాస్యనటులు సూరి & యోగిబాబు వంటి దిగ్గజాలకు వడివేలు - వివేక్‌తో సరిపోలడం లేదంటే అతిశయోక్తి కాదు.
1992లో ఒక సినిమాలో వడివేలుని ఎంపిక చేసుకున్న ఒక నిర్మాత వివరాల ప్రకారం.. వడివేలు ఇతర చిత్ర బృందంతో కలిసి వెంటనే సేలం వెళ్లాల్సి ఉందని, అయితే వారు రైలు లేదా బస్సులో ప్రయాణించలేకపోయారని, దానికి సమయం వృధా అయ్యే అవకాశం ఉండడంతో.. ఆ క్షణం వడివేలు సహా సిబ్బందికి వాయుధూత్ ఏటీఆర్ విమానంలో ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలని నిర్మాత నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో వడివేలు చాలా భావోద్వేగానికి గురయ్యాడు. తన జీవితంలో విమానంలో ప్రయాణించడం ఇదే మొదటిసారి అని, ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేను అని అన్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత అతడు ప్రభుదేవా చిత్రం 'లవ్ బర్డ్స్' (1996) కోసం లండన్ సహా విదేశాల్లో షూట్ చేసే అవకాశాన్ని పొందాడు. అవార్డు షోలలో తన కామెడీని ప్రదర్శించడానికి అతను చాలా దేశాలకు వెళ్ళాడు. తన అహంకారానికి పొగలు కక్కే అదృష్టం కలిగింది. అతడు తన సహనటులతో సరిగా లేడు. అలాగే నిర్మాతలకు డిమాండ్లు పెట్టేవాడు. అళగప్పన్‌లో శ్రియ శరణ్‌తో ఐటెం నంబర్ చేయమని ప్రముఖ నిర్మాత మాణిక్కం నారాయణన్‌ను వేధించాడని టాక్ వచ్చింది. శంకర్‌తో చేసిన 'ఇమ్సై అరసన్ 24వ పులికేసి' సంఘటన కారణంగా వడివేలు చాలా నష్టాన్ని తెచ్చిపెట్టినందున నిర్మాతలు విసుగు చెందారు. వడివేలుకు అవకాశాలివ్వకుండా తప్పించుకు తిరిగారు.
వడివేలు అంటే 90ల నాటి పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యాకా నవ్వుకుంటారు. అతడు తమిళ సినిమాలో హాస్యం ఎదుగుదలకు అందించిన సహకారం ఇప్పటికీ కొత్త తరాల ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. కానీ అతను కోల్పోయిన స్టార్‌డమ్‌ను తిరిగి పొందడానికి ప్రయత్నించినా విఫలమయ్యాడు. అతడు 60, 70 లలో హాస్యనటుడిగా ఉన్న నగేష్ లాగా తన నటనను మార్చగలిగితే, అతను విలన్, సహాయ నటుడు, తాత వంటి విభిన్న పాత్రలను ప్రయత్నించగలడు. వడివేలు అవసరానికి తగ్గట్టు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోలేదు. చిల్లర రాజకీయాల కోసం తన ఇమేజ్‌ని నాశనం చేసుకున్నాడు. వడివేలును తన సినీ మిత్రులు ఇప్పటికీ గౌరవిస్తారు.. కానీ అతను తన మొండితనం కారణంగా పరిశ్రమలోని చాలా మందితో గొడవలు పడ్డాడు.
ఇతర చిత్రాలు నటులపై వడివేలుకు ఉన్న అసూయను బహిర్గతం చేసే ఒక ప్రసిద్ధ సంఘటన జరిగింది. 2006లో వడివేలు సీమాన్ దర్శకత్వం వహించిన మాధవన్ చిత్రం తంబి 100 రోజుల ఫంక్షన్‌కు హాజరయ్యారు. ఆ చిత్రంలో వడివేలు మాధవన్ స్నేహితుడిగా నటించారు. ఈ సినిమాని హిట్ చేసినందుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రసంగించాడు. ఈ చిత్రంలో అతడి నటనకు అభిమానులు ప్రశంసించారు. ఆ సమయంలో విడుదలైన ఉయిర్ అనే సినిమాకు సంబంధించి వెంటనే మాట మార్చాడు. ఒక సోదరి తన బ్రదర్ ఇన్ లా కోసం ఆరాటపడటాన్ని డీల్ చేసిన సబ్జెక్ట్ అయినందున సినిమా ప్యాక్డ్ హౌస్‌లతో విజయవంతంగా నడుస్తోంది. సోదరి పాత్రలో సంగీత నటనకు అభిమానులు , విమర్శకుల ప్రశంసలు లభించాయి.
ఇది అనైతికమైన సినిమా అని, ఇలాంటి డర్టీ రిలేషన్స్‌ను ప్రోత్సహించే అసభ్య సినిమా తీయకూడదని వడివేలు ఆ సినిమాపై మండిపడ్డారు. నిజానికి 'ఇమసై అరసన్ 23 అం పులికేసి'లో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నందున తన సినిమాకి వారం ముందు విడుదలైనందున అతడు ఆ సినిమాను లక్ష్యంగా చేసుకున్నాడు. ఉయిర్ 30 జూన్ 2006న .. ఇమ్సై అరసన్ 23 ఎఎం పులికేసి 08 జూలై 06న విడుదలయ్యాయి. ఈ సినిమా వల్ల తన సినిమా ఫ్లాప్ అవుతుందని భయపడ్డాడు. సినిమా చూడ్డానికి థియేటర్‌కి వచ్చే పిల్లలకు పులికేశి ఫేక్ మీసాలతో సినిమాని ప్రమోట్ చేసే స్థాయికి కూడా వెళ్లాడు. అంతిమ ఫలితం ఏమిటంటే.. ఉయిర్ 100 రోజులు విజయవంతంగా ఆడగా, ఇమ్సాయి అరసన్ 23 ఎఎం పులికేసి కూడా 100 రోజులు విజయవంతంగా రన్ అయ్యింది.
తన సినిమాతో పోటీపడుతోందనే కారణంతో ఒక కొత్త దర్శకుడి సినిమాని తొక్కేయాలని అనుకున్నాడు. సినిమా సోదరులు తరచుగా ఇతర కళాకారుల పనిని గౌరవిస్తారు. వారి పనిలో మరింత ముందుకు వెళ్లమని ప్రోత్సహిస్తారు. వడివేలు ఆ రోజు సాటి ప్రతిభావంతులను వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అగౌరవపరిచారన్న చర్చా సాగింది. ఇలాంటి కారణాలతో అతడు కోలీవుడ్ లో తన ఇమేజ్ ను కోల్పోయాడు.