Begin typing your search above and press return to search.

సీరియస్ కాదు కామెడీ.. రవితేజ ఫస్ట్ టైమ్‌

రవితేజ లోని రెగ్యులర్ కమర్షియల్‌ యాంగిల్‌ ను ఈ సినిమాలో చూడమేమో అని కూడా కొందరు అనుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   2 Jan 2024 6:54 AM GMT
సీరియస్ కాదు కామెడీ.. రవితేజ ఫస్ట్ టైమ్‌
X

మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈగల్ సినిమాను ఈ సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. సంక్రాంతి పోటీని మరింత రసవత్తరంగా మార్చేందుకు రాబోతున్న ఈగల్ సినిమా పోస్టర్స్ మరియు ట్రైలర్‌ చూసిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు.

ఈగల్‌ సినిమా చాలా సీరియస్ నోడ్‌ లో సాగుతుందని అంతా భావిస్తున్నారు. రవితేజ లోని రెగ్యులర్ కమర్షియల్‌ యాంగిల్‌ ను ఈ సినిమాలో చూడమేమో అని కూడా కొందరు అనుకుంటున్నారు. వాటన్నింటికి దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని క్లారిటీ ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచాడు.

దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని మాట్లాడుతూ... చాలా రోజుల తర్వాత రవితేజ ను ఒక మాంచి మాస్ కాన్సెప్ట్‌ తో ప్రేక్షకులు చూడబోతున్నారు. తన వయసుకు తగ్గ పాత్రను చేయడంతో పాటు, మేకప్‌ లేకుండా రవితేజ ఈ సినిమాలో నటించాడు. విభిన్నమైన పాత్ర లో రవితేజ ను చూస్తారని చెబుతున్నాడు.

ఇక ఈ సినిమాను అంతా సీరియస్ సినిమా అనుకుంటున్నారు. కానీ అసలు విషయం ఏంటి అంటే ఈ సినిమా లో కామెడీ యాంగిల్ కూడా ఉంది. అంతా కూడా రవితేజ నుంచి ఆశించే కామెడీ సన్నివేశాలు ఈ సినిమాలో ఉంటాయి, అలాగే లవ్‌ సన్నివేశాలు కూడా ఈ సినిమా లో ఉంటాయని దర్శకుడు పేర్కొన్నాడు.