Begin typing your search above and press return to search.

ఛీఛీ మిడిలేజీ అంకుల్ వంక‌ర బుద్ది.. న‌టి చిరాకు!

ఇదేదో సినిమాలో స‌న్నివేశం అనుకుంటే గ్ర‌హ‌పాటే.. ఇది నిజంగా తాను అనుభ‌వించి ఫ‌ల‌వ‌రించిన స‌న్నివేశాలు అని కూడా చెప్పింది.

By:  Tupaki Desk   |   11 Feb 2024 4:51 AM GMT
ఛీఛీ మిడిలేజీ అంకుల్ వంక‌ర బుద్ది.. న‌టి చిరాకు!
X

వీధిలో అమ్మాయి క‌న‌బ‌డితే కుర్రాళ్ల‌కు రిమ్మ తెగులు. శ్రుతిమంచిపోయి చిలిపి చేష్ట‌లకు పాల్ప‌డ‌తారు. ఇక యూత్ సంగ‌తి ఇలా ఉంటే మిడిలేజీలో ఉన్న అంకుల్స్ ప‌రిస్థితి ఎలా ఉంటుందో కూడా డీటెయిల్డ్ గా చెప్పింది పాపుల‌ర్ యువ‌క‌థానాయిక‌. ఒక ర‌కంగా మిడిలేజీ క్రైసిస్ లో కొట్టుకుపోయే అంకుల్స్ మ‌న‌కు చాలా ఎక్కువమంది ఉంటార‌ని, రోడ్ లో అంద‌మైన‌ అమ్మాయి క‌నిపిస్తే చాలు చొంగ‌లు కార్చుకుంటూ కొంటె చూపులు చూస్తూ.. మీది మీదికి వ‌చ్చి రుద్దేస్తార‌ని కూడా సెల‌విచ్చింది స‌ద‌రు క‌థానాయిక‌. ఇదేదో సినిమాలో స‌న్నివేశం అనుకుంటే గ్ర‌హ‌పాటే.. ఇది నిజంగా తాను అనుభ‌వించి ఫ‌ల‌వ‌రించిన స‌న్నివేశాలు అని కూడా చెప్పింది.

ఒక‌సారి ఒక అంకుల్ ఏమ‌న్నారంటే.. ``మా ఆవిడ నా కూతురు ఊరెళ్లారు నువ్వు రా ఇంటికి అని పిలిచాడు``. ``అవునా అంకుల్ .. ఈరోజు ప్రాక్టీస్ కి రాలేను! అని చెప్పి అప్ప‌టికి త‌ప్పించుకున్నాను`` అని కూడా చెప్పింది. నిజానికి అవి కాలేజ్ కి వెళ్లే రోజులు. కాలేజ్ అయిపోయింది ఇంటికి వెళుతూ అంకుల్ కి ఎస్టీడీ బూత్ నుంచి ఫోన్ చేసాను. అంకుల్ ర‌మ్మ‌న్నాడు..నేరుగా ఇంటికే వ‌చ్చేయ‌మ‌న్నాడు.. అత‌డి వంక‌ర బుద్ధి అర్థ‌మైంది.. అందుకే వెళ్ల‌లేదు! అని కూడా తెలిపింది.

ఇదే విష‌యం నా ఫ్రెండుకు చెబితే ``నేను మంచోడు అనుకున్నాను ఛీ..`` అని అంతా ఛీద‌రించుకున్నారు. నెక్ట్స్ డే ప్రాక్టీస్‌ కి వెళ్లిన‌ప్పుడు మా లెక్చ‌ర‌ర్ కి చెప్పేశాను. వారంతా షాక‌య్యారు.

ఆయ‌న పెద్ద అసోసియేష‌న్ కి ప్రెసిడెంట్ కూడా... అలా చేస్తాడ‌ని అనుకోలేదు ఎవ‌రూ.. అందుకే కాలేజ్ లెక్చ‌ర‌ర్లు కూడా షాక‌య్యారు! అని తెలిపింది స‌ద‌రు హీరోయిన్. ఒక‌సారి హాస్ట‌ల్ లో ఉన్న‌ప్పుడు ఎవ‌డో ఆక‌తాయి హాస్ట‌ల్ గేటు ముందుకు వ‌చ్చి బ‌ట్ట‌లు విప్పేసి ఏదేదో చూపించాడ‌ని, ఏదేదో చేసాడ‌ని కూడా చెప్పింది. త‌న స్నేహితురాళ్ల‌కు మొర పెట్టుకుంటే ఇంచుమించు ఇలాంటి స‌న్నివేశ‌మే త‌మ‌కు కూడా ఎదురైంద‌ని చెప్పుకుని ల‌బోదిబోమ‌న్నార‌ని కూడా చెప్పింది. ఒక‌సారి ఇంకో ఆక‌తాయి అయితే నేరుగా ఇంటికే వెంబ‌డించి వచ్చేసాడు. ఇంటి ముందు నానా ర‌చ్చ చేసాడు. ఫ్రెండుకు ఫోన్ చేస్తే అది కూడా ఇలాంటి సీన్ నే ఎదుర్కొన్నాన‌ని చెప్పింది! అంటూ చాలా న‌మ్మ‌శ‌క్యం కాని విష‌యాల‌నే చెప్పింది.

టాలీవుడ్ లో అర‌కొర హిట్లు అందుకుని కొన్నాళ్ల పాటు హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసిన స‌ద‌రు యువ‌హీరోయిన్ అచ్చ తెలుగు అమ్మాయి. టీవీ యాంక‌ర్ గాను ప‌ని చేసింది. ఆ త‌ర్వాత అల్లరి ర‌విబాబు ఇచ్చిన హిట్ సినిమాతో టాలీవుడ్ లో పెద్ద పేరు తెచ్చుకుని కెరీర్ ప‌రంగా బిజీ అయింది. కానీ పోటీ ప్ర‌పంచంలో కెరీర్ ని నిల‌బెట్టుకోవ‌డంలో త‌డ‌బ‌డింది. అదే క్ర‌మంలో ఈ బ్యూటీ పేరు ప‌లు వివాదాల్లో కూడా వినిపించింది. అటుపై పూర్తిగా తెర‌కు దూర‌మైంది. ఇటీవ‌ల యూట్యూబ్ ఇంట‌ర్వ్యూల్లో ఘాటైన వ్యాఖ్య‌లు చేస్తూ ఈ భామ చేస్తున్న సంద‌డి అంతా ఇంతా కాదు. అలాంటి ఒక ఇంట‌ర్వ్యూ నుంచి ఛ‌మ‌క్కులాంటి ప‌లుకులు ఇవ‌న్న‌మాట‌!!