Begin typing your search above and press return to search.

హీరోల నమ్మకం.. తమన్ - దేవికి సైడ్ కొట్టగలడా?

మీడియం రేంజ్ హీరోలకు కరెక్ట్ మ్యూజిక్ కొడితే పాన్ ఇండియా ఆఫర్స్ వాటంతట అవే వస్తాయి.

By:  Tupaki Desk   |   22 Aug 2024 2:30 AM GMT
హీరోల నమ్మకం.. తమన్ - దేవికి సైడ్ కొట్టగలడా?
X

ఇటీవల టాలీవుడ్‌లోని మ్యూజిక్ డైరెక్టర్ల జాబితా మళ్ళీ పెరుగుతోంది. స్టార్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎంత మంది ఉన్నా కూడా కొత్త వారికి పుష్కలంగా అవకాశాలు వస్తూనే ఉంటాయి. అయితే అగ్ర హీరోల సినిమాలను అందుకోవడం మాత్రం అంత సులువు కాదు. అలాగని కష్టము కాదు. మీడియం రేంజ్ హీరోలకు కరెక్ట్ మ్యూజిక్ కొడితే పాన్ ఇండియా ఆఫర్స్ వాటంతట అవే వస్తాయి.

కొత్త తరహా మ్యూజిక్ తో మెప్పించడం అంటే ఇప్పుడు మాములు విషయం కాదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న సీనియర్స్ కూడా ఫుల్ ఆల్బమ్ చార్ట్ బస్టర్ అయ్యేలా ఇవ్వడం లేదని కామెంట్స్ వస్తున్నాయి. తమన్, దేవిశ్రీ ప్రసాద్ లాంటి సంగీత దర్శకులుకు పోటిగా, ఇతర భాషల నుంచి కొత్త సంగీత దర్శకులు తమ ప్రత్యేకతను చూపించడానికి ముందుకొస్తున్నారు.

ఈ ట్రెండ్‌లో సంతోష్ నారాయణన్, రవి బస్రూర్ వంటి పేర్లు ఇప్పటికే గుర్తింపు పొందాయి. ఇప్పుడీ జాబితాలో జేక్స్ బెజోయ్ చేరారు. ఆగస్ట్ 29న విడుదల కాబోతున్న "సరిపోదా శనివారంకి" సినిమా అతను కెరీర్ కు చాలా ముఖ్యం. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటల విషయంలో నాని అతఙ వర్క్ ను మెచ్చాడు. ముందుగా ట్రైలర్‌లోనే ఈ సంగీతం రేంజ్ ఏమిటో చెప్పకనే చెప్పింది.

ఆలాగే మెకానిక్ రాఖీ సినిమాకు కూడా అదిరిపోయే మ్యూజిక్ సెట్ చేస్తున్నట్లు హీరో విశ్వక్ కాన్ఫిడెంట్ గా చెప్పాడు. దీన్ని బట్టి జేక్స్ కు ప్రస్తుత టైమ్ పీరియడ్ అనేది చాలా ముఖ్యం అని చెప్పవచ్చు. జేక్స్ బెజోయ్‌కి టాలీవుడ్‌లో చేసే తొలి ప్రయత్నం కాదు. గతంలో విజయ్ దేవరకొండ నటించిన "టాక్సీ వాలా" సినిమాతో తన ప్రతిభను రుజువు చేసుకున్నాడు.

"చావు కబురు చల్లగా," "పక్కా కమర్షియల్" లాంటి చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోయినా, "ఒకే ఒక జీవితం"తో మంచి హిట్ అందుకున్నాడు. జేక్స్ బెజోయ్ ఇప్పుడు మలయాళంలోనే కాకుండా ఇతర భాషల్లోనూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, "సరిపోదా శనివారంకి"లోని ఆయన సంగీతం, అతని టాలీవుడ్ కేరీర్‌కు బలమైన ముద్ర వేయబోతుందన్న నాని ఆశలు నిజమవుతాయని చూస్తున్నారు.

హీరోలు అయితే ఈ మ్యూజిక్ డైరెక్టర్ ను చాలా గట్టిగా నమ్ముతున్నారు. ఇక ఏమాత్రం క్లిక్కయినా థమన్, దేవి లాంటి మాస్ కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ లకు పోటీ ఇవ్వగలడు అనేలా కామెంట్స్ వస్తున్నాయి. మరి రాబోయే సినిమాలు అతనికి ఎలాంటి ఫలితాన్ని అందిస్తాయో చూడాలి.