సలార్, కల్కి... కమర్షియల్ ఎలిమెంట్స్ కి కాస్త దూరం
లార్ మరియు కల్కి సినిమాల్లో ఒకటి లేదా రెండు పాటలు మాత్రమే ఉండే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది
By: Tupaki Desk | 8 Aug 2023 4:24 AM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సలార్, కల్కి 2898 ఏడీ సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్ తో పాన్ ఇండియా రేంజ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా రూపొందడంతో సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
ఇక మహానటి ఫేం నాగ్ అశ్విన్ ఏకంగా హాలీవుడ్ మూవీ రేంజ్ లో ప్రభాస్ తో కల్కి 2898 ఏడీ సినిమా ను రూపొందిస్తున్నారు. ఈ సినిమా గ్లిమ్స్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇది కచ్చితంగా ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ అవ్వాల్సిన సినిమా అన్నట్లుగా నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ రెండు సినిమాలు కూడా చాలా పోలికలు కలిగి ఉన్నాయి.
ముఖ్యంగా ఈ రెండు సినిమాలు కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమాల మాదిరిగా ఉండబోవడం లేదు. అంటే సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో అయిదు ఆరు పాటలు, నాలుగు అయిదు యాక్షన్ సన్నివేశాలు, కామెడీ ట్రాక్, హీరో హీరోయిన్ లవ్ ట్రాక్, రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి.
కానీ సలార్ లో కానీ, కల్కి లో కానీ ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండబోవడం లేదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు విభిన్నంగా ఈ సినిమాలు ఉండబోతున్నాయి. ఈ రెండు సినిమాల్లో కూడా కామెడీ అనేదాన్ని ఆశించలేం. ఇక పాటల విషయంలో కూడా రెండు పాటలు రెగ్యులర్ కమర్షియల్ ప్రేక్షకులకు నిరాశ కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సలార్ మరియు కల్కి సినిమాల్లో ఒకటి లేదా రెండు పాటలు మాత్రమే ఉండే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. సినిమాల కాన్సెప్ట్ కి పాటలు తక్కువ ఉంటేనే బెటర్. కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం ఈ సినిమాల్లో పాటలు పెట్టే పరిస్థితి లేదు.
ఇక కామెడీ సీన్స్ ను కూడా జొప్పించాలని ఈ దర్శకులు అనుకోరు. కనుక ఈ రెండు సినిమాలు కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు కాస్త దూరంగా ఉండబోతున్నాయి. కమర్షియల్ సినిమాల మాదిరిగా ఉండకున్నా కూడా కచ్చితంగా వేల కోట్ల వసూళ్లు రాబట్ట గల సత్తా ఉన్న సినిమాలు అనడంలో సందేహం లేదు.