Begin typing your search above and press return to search.

టీజర్ టాక్ : 'కమిటీ కుర్రోళ్ళు' బాల్యాన్ని గుర్తు చేస్తున్నారుగా!

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక కొణిదెల.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది

By:  Tupaki Desk   |   14 Jun 2024 1:24 PM GMT
టీజర్ టాక్ :  కమిటీ కుర్రోళ్ళు బాల్యాన్ని గుర్తు చేస్తున్నారుగా!
X

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక కొణిదెల.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. విడాకుల తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన నిహారిక.. వాట్ ది ఫిష్ మూవీతో టాలీవుడ్ లోకి ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం తమిళంలో కూడా మద్రాస్కరన్ మూవీ చేస్తోంది. గ‌త ఏడాది డెడ్‌ పిక్సెల్స్ అనే వెబ్‌ సిరీస్‌ లో న‌టించి మంచి పేరు సంపాదించుకుంది మెగా డాటర్.

మరోవైపు, తన సొంత బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ పై కమిటీ కుర్రోళ్ళు మూవీని నిర్మిస్తోంది. నిహారిక సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్లపై నాగబాబు సతీమణి పద్మజ, జయలక్ష్మి అడపాక నిర్మాతలుగా ఆ సినిమా రూపొందుతోంది. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా.. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇప్పటికే మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ సంపాదించుకున్నాయి

ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. దీంతో ప్రమోషన్లలో స్పీడ్ పెంచారు. అందులో భాగంగా నేడు టీజర్ ను సోషల్ మీడియాలో హీరో నితిన్ ద్వారా విడుదల చేశారు. కమిటీ కుర్రోళ్ళు సినిమా టీజర్ చూస్తుంటే.. గోదావరి జిలాల్లోని ఓ ఊర్లో ఉండే 90s స్నేహితుల కథగా తెలుస్తోంది. కొంతమంది స్నేహితులు.. చిన్నప్పుడు అంతా కలిసి ఆడుకుంటున్న సీన్స్ తో టీజర్ ప్రారంభమైంది.

ఆ తర్వాత అందరూ సరదాగా జాతరలో తిరుగుతారు, తింటారు, టీవీ చూస్తారు. అలా అంతా పెద్దయ్యాక.. టీజర్ చివర్లో ఊర్లో గొడవలు జరిగినట్టు చూపించారు. ఓ హీరో గట్టిగా అరుస్తుండగా టీజర్ ముగిసింది. మొత్తానికి టీజర్.. ఇంట్రెస్టింగ్ గా సాగుతూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తోంది. ఆడియన్స్ ను చిన్ననాటి రోజులకు తీసుకెళ్తోంది. చిన్నప్పుడు స్నేహితులతో ఉన్న గోల్డెన్ మూమెంట్స్ ను గుర్తుచేస్తోంది.

సినిమా స్టోరీ లైన్ క్లారిటీగా చెప్పకపోయినప్పటికీ స్నేహితుల మధ్య ఫైట్ జరిగినట్లు చూపించడంతో.. ఏం జరిగిందన్న ఆసక్తి అందరిలో నెలకొంది. విజువల్స్ చాలా నేచురల్ గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. మంచి కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ మూవీతో యదు వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అనుదీప్ దేవ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఈ సినిమాలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రాచిరాజు, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్టా, అక్షయ్ శ్రీనివాస్, శరణ్య సురేష్, తేజ శ్రీనివాస్, శరణ్య రావు, తేజ వంటి పలువురు నటిస్తున్నారు. శరణ్య సురేష్, తేజస్వి రావు, విషిక, షణ్ముఖి హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. వెంకట సుభాష్ చీర్ల, కొండల్ రావు అడ్డగళ్ల డైలాగ్స్ అందిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.