Begin typing your search above and press return to search.

నిహారిక 'కమిటీ కుర్రోళ్ళు'.. ట్రైలర్ ఎలా ఉందంటే..

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

By:  Tupaki Desk   |   26 July 2024 9:39 AM GMT
నిహారిక కమిటీ కుర్రోళ్ళు.. ట్రైలర్ ఎలా ఉందంటే..
X

మెగా డాటర్ నిహారిక కొణిదెల.. మల్టీ టాలెంటెడ్ గా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. బుల్లితెరపై హోస్ట్ గా సందడి చేస్తున్న నిహారిక.. వెండితెరపై సినిమాలతో అలరిస్తోంది. దాంతోపాటు నిర్మాతగా సత్తా చాటుతోంది. ఆమె ప్రొడ్యూస్ చేస్తున్న కమిటీ కుర్రోళ్ళు మూవీ ఇప్పుడు రిలీజ్ కు సిద్ధమవుతోంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

అయితే ఈ మూవీ ద్వారా ఏకంగా 20 మందికి పైగా కొత్త వాళ్ళు సినీ ఇండస్ట్రీకి ప‌రిచ‌యం అవుతున్నారు. సందీప్ సరోజ్, యశ్వంత్, ఈశ్వర్ త్రినాథ్ సహా అనేక మంది ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్ప‌టికే మూవీ నుంచి విడుద‌లైన టీజ‌ర్‌, పాట‌లు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. ఆగస్టు 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

దీంతో రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ ను పెంచుతున్నారు. వినూత్న రీతిలో ప్రమోట్ చేసి అందరి దృష్టిను తమ సినిమా వైపు తిప్పుకుంటున్నారు. తాజాగా మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. గోదావరి జిలాల్లోని ఓ ఊర్లో ఉండే 90s కిడ్స్ స్టోరీతో మూవీ రూపొందినట్లు ఈజీగా అర్థమవుతుంది. ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటూ మూవీపై అంచనాలను పెంచుతోంది.

ట్రైలర్ విషయానికొస్తే.. అమ్మవారి జాతర సీన్ తో సందడిగా ప్రారంభమైంది. ఊరంతా అమ్మవారిని కొలుస్తున్నట్లు చూపించారు. ఆ తర్వాత విద్యార్థులంతా ఎంసెట్ ఎగ్జామ్ రాస్తారు. గ్రామ పంచాయతీ సీన్ తో సాయి కుమార్ పవర్ ఫుల్ గా ఎంట్రీ ఇచ్చారు. ఓసీ క్యాటగిరీ విద్యార్థి మంచి ర్యాంక్ రాకపోవడంతో బాధపడతాడు. ఆ తర్వాత చిన్నగొడవ జరుగుతోంది. అది కాస్త పెద్ద గొడవకు దారితీస్తుంది. రెండు గ్రామాల మధ్య బ్రిడ్జి ముఖ్య అంశంగా నిలుస్తుంది. మరి చివరకు ఏం జరిగిందనేది సినిమాగా తెలుస్తోంది.

ట్రైలర్‌ ను చూస్తుంటే.. ఈ సినిమా కథ అంతా పల్లెటూర్ల చుట్టూ తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. గ్రామంలో జాతర, గ్రామస్థుల మధ్య కొట్లాటలు, స్నేహితుల మధ్య మనస్పర్థలు, ఎన్నికల వంటి పలు అంశాలు ముఖ్యంగా కనిపిస్తున్నాయి. విజువల్స్ చాలా నేచురల్ గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. మొత్తానికి ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. మరి ఈ చిత్రం ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.