పుష్ప 2.. తండేల్.. భలే మ్యాచ్ చేశారే..!
ఐతే ఈ డిస్కషన్స్ లో కొన్ని విషయాలు విచిత్రంగా ఒకేలా అనిపిస్తాయి.
By: Tupaki Desk | 12 Feb 2025 1:30 AM GMTకొన్ని సినిమాల మధ్య పోలిక భలే విచిత్రంగా ఉంటుంది. సినిమా రిలీజ్ అయ్యాక ప్రేక్షకులకు బాగా నచ్చేసిన సినిమాల గురించి ఎక్కువ డిస్కషన్స్ చేస్తుంటారు. ఐతే ఈ డిస్కషన్స్ లో కొన్ని విషయాలు విచిత్రంగా ఒకేలా అనిపిస్తాయి. ముఖ్యంగా ఈమధ్యనే పాన్ ఇండియాలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పుష్ప 2 నాలుగు రోజుల క్రితం రిలీజైన తండేల్ ఈ రెండు సినిమాల మధ్య ఒక ప్రత్యేకమైన పోలిక గురించి సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు.
పుష్ప 2 సినిమా చివర్లో పుష్ప రాజ్ ఇంటికి పెళ్లి కార్డ్ తీసుకుని అజయ్ రాగా ఆ పెళ్లి కార్డ్ చూసుకుని అందులో పుష్ప రాజ్ పేరు ముందు ఇంటి పేరు ఇంకా తన మదర్ పేరు ముందు ఇంటి పేరు చూసి పుష్ప రాజ్ ఎమోషనల్ అయ్యి ఏడుస్తాడు. ఐతే తండేల్ సినిమాలో కూడా క్లైమాక్స్ లో సత్య పెళ్లి కార్డ్ చూసి ఎమోషనల్ అవుతాడు. అక్కడ ఒక చిన్న బిట్ సాంగ్.. ఇంకా చైతు డైలాగ్ అబ్బో సినిమాకే హైలెట్ అనిపిస్తాయి.
ఐతే రెండు సినిమాల్లో పెళ్లి కార్డు తో ఎమోషన్ పండిస్తారు. ఐతే రెండు సినిమాల్లో ఆ సీన్ లో సందర్భం వేరే అయినా రెండు సీన్స్ పెళ్లి కార్డు హీరో చూశాకే వస్తాయి. దాన్ని పోల్చి చూస్తే భలే విచిత్రంగా పుష్ప 2, తండేల్ మ్యాచ్ అయ్యాయే అని సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. హిట్ అయిన సినిమాకు ఇలాంటి పోలికలు ఎన్నైనా చూస్తారు. ఏది ఏమైనా తండేల్ తో నాగ చైతన్య నటుడిగా ఎన్నో మెట్లు ఎక్కేశాడు.
తండేల్ ఇచ్చిన బూస్టింగ్ తో కెరీర్ ని పర్ఫెక్ట్ గా సెట్ చేసుకుంటే మాత్రం నాగ చైతన్య కి ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పొచ్చు. తండేల్ సినిమా చూసిన అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ సినిమా రిజల్ట్ తో సూపర్ హ్యాపీగా ఉన్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించిన తండేల్ సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. మ్యూజిక్ పరంగా కూడా సినిమా నెక్స్ట్ లెవెల్ అనిపించుకుంది.