Begin typing your search above and press return to search.

సలార్, వార్ 2 మధ్య ఒక పోలిక !

ఇదిలా ఉంటే ఈ సినిమాలో శత్రువులుగా మారిన స్నేహితులుగా ప్రభాస్, పృథ్వీరాజ్ పాత్రలు ఉంటాయంట.

By:  Tupaki Desk   |   1 Dec 2023 4:04 AM GMT
సలార్, వార్ 2 మధ్య ఒక పోలిక !
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా సలార్. ఈ మూవీ డిసెంబర్ 22న థియేటర్స్ లోకి రాబోతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సిద్ధమవుతోన్న సలార్ రెండు భాగాలుగా రానుంది. ఇందులో మొదటి భాగం డిసెంబర్ లో రిలీజ్ అవ్వబోతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో శత్రువులుగా మారిన స్నేహితులుగా ప్రభాస్, పృథ్వీరాజ్ పాత్రలు ఉంటాయంట.

ఆ పాత్రల మధ్య సంఘర్షణతోనే సలార్ మొదటి పార్ట్ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇంటరెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తోన్న వార్ 2లో కూడా ఇలాంటి లైన్ టచ్ చేస్తున్నారంట. అయితే ఇది రివర్స్ లో ఉంటుందని టాక్. సలార్ లో ఫ్రెండ్స్ శత్రువులు అయితే, వార్ 2లో శత్రువులుగా ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారని తెలుస్తోంది.

వారి మధ్య ఎలాంటి సంఘర్షణ ఉంది. ఎందుకు మిత్రులుగా కలిసి పని చేయాల్సి వస్తుంది అనేది వార్ 2 కథలో చూపించబోతున్నట్లు టాక్. ఈ మూవీలో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారంట. ఇలా ఇంచు మించి ఒకే లైన్ అయిన భిన్నమైన రూట్స్ లో సలార్, వార్ 2 కథలని ఆయా దర్శకులు నడిపించేలా కథనం రాసుకున్నారు.

మన టాలీవుడ్ స్టార్ హీరోలు పాన్ ఇండియా ఇమేజ్ తో దేశ వ్యాప్తంగా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకొని సత్తా చాటుతున్నారు. అయితే రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా సినిమా సినిమాకి కొత్తదనం అందించే ప్రయత్నం ప్రస్తుతం చేస్తున్నారు. అందుకే మనవాళ్ళకి డిమాండ్ కూడా పెరిగింది. అందుకు తగ్గట్లుగానే రెమ్యునరేషన్ లు భారీగా తీసుకుంటున్నారు.

మార్కెట్ ఉండటంతో నిర్మాతలు కూడా ఎక్కువగా ఆలోచించకుండా హీరోలు అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధం అయిపోతున్నారు. ఈ కారణంగా మన టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ కూడా వంద కోట్ల వరకు రెమ్యునరేషన్ లో వచ్చేశారు. ప్రభాస్ అయితే వంద కోట్లకి పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉండటం విశేషం.