Begin typing your search above and press return to search.

ఆస్కార్ వేదిక‌పై హిందీ..సర్ ప్రైజ్ అయిన భార‌తీయులు!

ఇప్ప‌టికే ఆస్కార్ అవార్డులు, పాన్ ఇండియా సినిమాల‌తో భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు ద‌క్కించుకుంది.

By:  Tupaki Desk   |   3 March 2025 3:03 PM IST
ఆస్కార్ వేదిక‌పై హిందీ..సర్ ప్రైజ్ అయిన భార‌తీయులు!
X

ఇప్ప‌టికే ఆస్కార్ అవార్డులు, పాన్ ఇండియా సినిమాల‌తో భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు ద‌క్కించుకుంది. భార‌తీయ సినిమాల‌కంటూ ప్ర‌పంచ వేదిక‌ల‌పై ప్ర‌త్యేక‌మైన స్థానం ఏర్ప‌డు తుంది. భార‌తీయ న‌టులుకు ప్ర‌పంచ భాష‌ల్లోనూ అవ‌కాశాలు అందుకుంటున్నారు. హాలీవుడ్ మేక‌ర్స్ రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ లాంటి వాళ్ల‌ను పిలిచి మ‌రీ ఆహ్వానిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఈ ఏడాది భార‌త్ త‌రుపున ఆస్కార్ కోసం `అనూజ` చిత్రం పోటీ ప‌డిన సంగ‌తి తెలిసిందే.

కానీ ఈ రేసులో `అనూజ` ఓట‌మి పాలైంది.'అనూజ‌'ను ఓడించి లైవ్ యాక్ష‌న్ ఫిల్మ్ కోటాలో `ఐయామ్ నాట్ ఏ రోబో` అవార్డును గెలుచుకుంది. అలా భార‌త్ చిత్రం ఆస్కార్ తుది పోరులు త‌ల వ‌చ్చింది. రేసులో గెలుపోట‌ములు స‌హ‌జం. అయితే ఆస్కార్ వేడుక‌లో హిందీ భాష హైలైట్ అయింది. ఈ వేడుక‌ను కాన‌న్ ఓ బ్రెయిన్ హోస్ట్ చేసారు. ఈ సంద‌ర్భంగా ఆస్కార్ వేడుక‌పై హిందీలో మాట్లాడారు. భార‌త ప్ర‌జ‌ల‌కు శుభోద‌యం అంటూ ప‌ల‌క‌రించారు.

ఈ వేడుక జ‌రిగే స‌మ‌యం మీకు ఉద‌యం క‌దా? అంద‌రూ టిపిన్ చేసారా? అంటూ ఆక‌ట్టుకున్నారు. దీనికి భార‌తీయులంతా ఎంతో సంతోష ప‌డ్డారు. నెట్టింట నెటి జ‌నులు ఫిదా అవుతున్నారు. భార‌తీయులంతా దీన్ని ప్ర‌త్యేక గౌర‌వంగా భావిస్తున్నారు. `అనూజ‌`కు అవార్డు వ‌స్తే బాగుంద‌ని చాలా మంది భార‌తీయులు ఆశ‌ప‌డ్డారు. ఆ ర‌క‌మైన పోస్టుల‌తో అనూజ‌ను నెట్టింట హైలైట్ చేసారు.

కాన‌న్ బ్రెయిన్ హోస్ట్ గా వ్య‌వ‌రించడం ఇదే తొలిసారి. అయినా? భార‌త‌యుల ప‌ట్ల ఆయ‌న వ్య‌వ‌రించిన తీరుకు అంతా ఫిదా అవుతున్నారు. ఆస్కార్ వేదిక‌పై ఇప్ప‌టి వ‌ర‌కూ ఎంతో మంది హోస్ట్ ల‌ను చూసాం. ఇలా భార‌తీయుల ప‌ట్ల ప్ర‌త్యేక అభిమానంతో ప‌ల‌క‌రించ‌డం మీకే సాధ్యమైంది? అంటూ కాన‌న్ స్పీచ్ కి ఫిదా అవుతున్నారు.