Begin typing your search above and press return to search.

'బ్యాడ్ గర్ల్' టీజర్ పై చర్చ.. నటి శాంతి ప్రియ మద్దతు

అయితే టీజర్ లో ఒక బ్రాహ్మణ అమ్మాయిని చాలా బోల్డ్ గా చూపించడం కొందరి మనోభావాలు దెబ్బ తీశాయి. దీంతో పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు.

By:  Tupaki Desk   |   30 Jan 2025 9:30 PM GMT
బ్యాడ్ గర్ల్ టీజర్ పై చర్చ.. నటి శాంతి ప్రియ మద్దతు
X

కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్, బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ సంయుక్తంగా నిర్మిస్తున్న బ్యాడ్ గర్ల్ మూవీ టీజర్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంజలి శివరామన్ లీడ్ రోల్ లో నటిస్తుండగా.. వర్ష భరత్ తెరకెక్కిస్తున్నారు. రిపబ్లిక్ డే రోజు టీజర్ ను రిలీజ్ చేయగా.. దాని కోసమే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు.

టీజర్ బట్టి చూస్తే.. డిఫరెంట్ మూవీగా బ్యాడ్ గర్ల్ ఉండనున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. రియల్ లైఫ్ రిఫ్లెక్ట్ చేసే కథగా అర్థమవుతోంది. స్కూల్ చదువుతున్నప్పటి నుంచే తనకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉండాలని కోరుకునే ఓ బ్రాహ్మణ అమ్మాయి జీవితంలో జరిగిన పరిణామాలతో సినిమా ఉండనున్నట్లు టీజర్ గా స్పష్టమవుతోంది.

అయితే టీజర్ లో ఒక బ్రాహ్మణ అమ్మాయిని చాలా బోల్డ్ గా చూపించడం కొందరి మనోభావాలు దెబ్బ తీశాయి. దీంతో పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. ఓ వర్గం మీద సెటైరికల్‌ గా సినిమా తీస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇదో చెత్త సినిమా అంటూ తీవ్రంగా కామెంట్లు పెడుతున్నారు. దీనితో సోషల్ మీడియాలో యుద్ధమే నడుస్తుంది.

అదే సమయంలో కొందరు సినిమాకు మద్దతు తెలుపుతున్నారు. సినిమాను సినిమాగానే చూడాలని హితవు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో నటి శాంతి ప్రియ స్పందించారు. బ్యాడ్ గర్ల్ మూవీని సమర్థించారు. సినిమా ఏ ప్రత్యేక వర్గాన్ని కించపరచడం లేదని.. మేకర్స్ కథ ద్వారా చాలా చెప్పాలనుకుంటున్నారని అభిప్రాయపడ్డారు.

కళ అనేది వ్యక్తీకరణ మాధ్యమమని, సినిమా తరచుగా సమాజంలోని సంక్లిష్టతలను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఒక బ్రాహ్మణ అమ్మాయి జీవితాన్ని ప్రదర్శించడం అంటే వాస్తవికతను సూచించే ముడి, పాత్రలను ప్రదర్శించడంగా పరిగణించాలని సూచించారు. అనురాగ్ కశ్యప్, వెట్రిమారన్ పై ప్రశంసలు కురిపించారు.

సామాజిక అంశాలను ముందుకు తీసుకురావడంలో కశ్యప్, వెట్రిమారన్ ధైర్యంగా ఉన్నారని ఆమె తెలిపారు. అసమానతలతో పాటు అసౌకర్యమైన విషయాలు బయటకు తీసుకు వచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని అన్నారు. మూవీపై కామెంట్స్ చేసే కన్నా.. ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు శాంతి ప్రియ.

ప్రస్తుతం శాంతి ప్రియ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైర్ గా మారాయి. జనవరి 31న రోటర్‌ డ్యామ్‌ లో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బ్యాడ్ గర్ల్ ప్రీమియర్ షోను ప్రదర్శించనున్నారు మేకర్స్. కాగా థియేట్రికల్ రిలీజ్ డేట్ ను ఇంకా అనౌన్స్ చేయలేదు. మరి ఆ సినిమా ఎప్పుడు థియేటర్లలో రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.