నిర్మాతతో వివాదం.. పాయల్ ఇప్పుడేం చెబుతుందో?
అయితే నిర్మాత ప్రణదీప్ ఇప్పటికే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు పాయల్ పై ఫిర్యాదు చేయడం ఈ వివాదం కొత్త మలుపు తిరుగుతోంది.
By: Tupaki Desk | 21 May 2024 8:35 AM GMTఆర్ ఎక్స్ 100 మూవీతో తెలుగు మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.. రెండు రోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆమె నటించిన రక్షణ మూవీ మేకర్స్.. సొంపులు చూపిస్తే బాగుంటుందని డిస్ట్రిబ్యూటర్లు అడుగుతున్నట్లు తనతో చెప్పారని పాయల్ పెట్టిన పోస్ట్ ఒక్కసారి ఇండస్ట్రీలో కలకలం రేపింది. అయితే నిర్మాత ప్రణదీప్ ఇప్పటికే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు పాయల్ పై ఫిర్యాదు చేయడం ఈ వివాదం కొత్త మలుపు తిరుగుతోంది.
అసలేం జరిగిందంటే?
పాయల్ రాజ్ పుత్ నటించిన రక్షణ సినిమా దాదాపు ఐదేళ్ల తర్వాత ఇప్పుడు రిలీజ్ కు రెడీ అవుతోంది. విడుదలకు ముందు ఇప్పుడు హీరోయిన్, నిర్మాత మధ్య పెద్ద వివాదమే నడుస్తోంది. "రీసెంట్‌గా మంగళవారం సినిమా హిట్ అవ్వడంతో రక్షణ సినిమాను ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. అగ్రిమెంట్ ప్రకారం రెమ్యునరేషన్ ఇవ్వకుండానే ప్రమోషన్స్ కు రావాలని ఒత్తిడి తెస్తున్నారు. రాకపోతే ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు. న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి నేను సిద్ధం" అని పోస్ట్ చేసింది పాయల్.
అక్కడికి ఒక రోజు తర్వాత.. టాలీవుడ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ స్పందించింది. తమకు పాయల్ పై మార్చి నెలలోనే నిర్మాత ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. రక్షణ మూవీలో పాయల్ నటించిందని, కాబట్టి ఆమె పేరును వాడుకునే హక్కు నిర్మాతకు ఉంటుందని నిర్మాతల మండలి స్పష్టం చేసింది. అయితే ఈ ఫిర్యాదును మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఫార్వర్డ్ చేశామని, కానీ పాయల్ రాజ్ పుత్ అందులో మెంబర్ కాదని తెలిసినట్లు చెప్పింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కు కూడా ఫార్వర్డ్ చేసినట్లు తెలిపింది.
కౌన్సిల్ స్పందించాక ఈ వివాదంపై నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది. అయితే పాయల్ పోస్ట్ చేయగానే.. అందరూ ఆమెకు మద్దతుగా నిలిచి చాలా పోస్టులు పెట్టారు. ఇలా కూడా టార్గెట్ చేస్తున్నారా అని ప్రశ్నించారు. కానీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ స్పందించడంతో మొత్తం సీన్ అంతా రివర్స్ అయింది. ప్రెస్ నోట్ లో.. పాయల్ ఇచ్చిన డేట్స్ నుంచి రెమ్యునరేషన్ వరకు అంతా క్లియర్ గా కౌన్సిల్ వివరించడంతో ఒక్కసారిగా అంతా షాకవుతున్నారు. పాయల్ పోస్ట్ వెనుక కారణమేంటోనని చర్చించుకుంటున్నారు.
అయితే ఏ ప్రాజెక్ట్ అయినా కొన్ని కారణాల వల్ల రిలీజ్ లేటు అవ్వడం సహజం. కానీ సినిమా ఎప్పుడు విడుదల అయినా క్లాజ్ 16 ప్రకారం.. ప్రమోషన్స్ విషయంలో యాక్టర్స్ సహకరించడం వారి బాధ్యత. దానికి తోడు కోవిడ్ సమయంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని సినిమాను షూట్ చేసినట్లు మేకర్స్.. ఫిర్యాదులో చెప్పి ఉన్నారు. కాబట్టి ఎలాంటి సమస్యలు ఉన్నా.. పరస్పరం చర్చించుకుని పరిష్కరించుకోవాలని నెటిజన్లు అంటున్నారు. ఇక ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రకటన తర్వాత పాయల్ ఇంకా స్పందించలేదు. మరేం చెబుతుందో చూడాలి?