వైజాగ్, హైదరాబాద్ షెడ్యూల్స్ తో ముగింపు!
సూపర్ స్టార్ రజనీకాంత్ 171 చిత్రం `కూలీ` లొకేష్ కనగరాజ్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 10 Feb 2025 8:30 AM GMTసూపర్ స్టార్ రజనీకాంత్ 171 చిత్రం `కూలీ` లొకేష్ కనగరాజ్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇందులో రజనీ గోల్డ్ స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన రజనీ ఫస్ట్ లుక్ సహా ప్రచార చిత్రాలన్నీ భారీ బజ్ ని తీసుకొచ్చాయి. ఈ సినిమా కొన్ని నెలలుగా సెట్స్ లోనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా షూటింగ్ ముగింపు దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. చెన్నై విమానశ్రయంలో రజనీకాంత్ పై కీలక సన్నివేశాలు చిత్రీక రించారు. దీంతో అక్కడ షెడ్యూల్ ముగిసినట్లు తెలుస్తోంది. త్వరలో వైజాగ్ లో కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారుట. వైజాగ్ లోనే పది రోజులకు పైగా షూటింగ్ చేస్తారని సమాచారం. అనంతరం అదే షెడ్యూల్ లోభాగంగా హైదరాబాద్ లో నూ కొంత పార్టు షూటింగ్ కంటున్యూటీగా ఉంటుందని తెలుస్తోంది.
అలాగే ఇదే నెలలో సినిమాకి సంబంధించిన తొలి గ్లింప్స్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీనిపై వచ్చే వారంలో స్పష్టత వస్తుందని సమాచారం. ఈ చిత్రాన్ని మేలో రిలీజ్ చేయాలని తొలుత ప్లాన్ చేసారు. అయితే షూటింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్నటైమ్ లో పూర్తిచేయగల్గితేనే మే లో రిలీజ్ అవుతుంది. లేదంటే? చిత్రాన్ని ఆగస్టులో నే రిలీజ్ చేయాలని మరో ప్రపోజల్ కూడా తెరపైకి వస్తోంది.
ఈ సినిమా రిలీజ్ కోసం రజనీకాంత్ కూడా ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. `ఖైదీ`, `విక్రమ్` తర్వాత లోకేష్ తో సినిమా చేయాలని పట్టుబట్టి మరీ రజనీకాంత్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం రజనీ ఆన్ సెట్స్ లో అంతే కష్ట పడుతున్నారు. వయసు మర్చిపోయి మరీ రజనీకాంత్ యాక్షన్ సన్నివేశాల్లో ఎంతో ఎఫెర్ట్ పెట్టి పని చేస్తున్నారు.