రజినీకాంత్ కూలీ టీజర్ అప్డేట్
తమిళనాడు తో పాటూ తెలుగు రాష్ట్రాల్లో కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ కు నెక్ట్స్ లెవెల్ క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 26 Feb 2025 1:52 PM GMTతమిళనాడు తో పాటూ తెలుగు రాష్ట్రాల్లో కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ కు నెక్ట్స్ లెవెల్ క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే. జైలర్ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ అందుకుని సాలిడ్ కం బ్యాక్ ఇచ్చిన రజినీకాంత్ రీసెంట్ గానే ఆ సినిమాకు సీక్వెల్ ను అనౌన్స్ చేశాడు. జైలర్ తర్వాత వేట్టయాన్ మూవీతో మరో సక్సెస్ అందుకుని మంచి ఫామ్ లో ఉన్నాడు రజినీ.
ఇక అసలు విషయానికొస్తే ప్రస్తుతం రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్ లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో కూలీ కూడా ఒకటి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కు సంబంధం లేకుండా తెరకెక్కుతున్న ఈ సినిమా స్టాండ్ ఎలోన్ ఫిల్మ్ గా రూపొందుతుంది.
కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, చిత్ర యూనిట్ కూలీ టీజర్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుందట. ఇప్పటికే టీజర్ ను లాక్ చేశారని, మరో రెండు వారాల్లో టీజర్ రిలీజ్ కానుందని, టీజర్ తో పాటూ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసి, ఆ రోజే అనౌన్స్ చేయనున్నట్టు తెలుస్తోంది. టీజర్ కట్ ను చూసి రజినీకాంత్ మరియు టీమ్ చాలా హ్యాపీగా ఫీలయ్యారంటున్నారు.
మార్చి 14న డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ కూలీ నుంచి ఏదైనా విజువల్ కంటెంట్ ను రిలీజ్ చేయాలనే ఆలోచనతో టీజర్ ను రిలీజ్ చేయనున్నారని అంటున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకుని గుమ్మడికాయ కొట్టడానికి రెడీ అవుతుంది.
పూజా హెగ్డే ఈ సినిమాలో రజినీ సరసన స్పెషల్ సాంగ్ చేయనుండగా, ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో నాగార్జునతో పాటూ ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్ తో పాటూ బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ కూడా క్యామియో చేయనున్నాడని అంటున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.