కోర్ట్ కలెక్షన్స్.. 9 రోజుల్లో ఎంత వచ్చాయంటే?
త్వరలోనే రూ.50 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఓ కోర్ట్ రూమ్ డ్రామా మూవీకి ఇంత ఆదరణ రావడం తెలుగులో ఇదే మొదటిసారి అన్నట్టు అనిపిస్తోంది.
By: Tupaki Desk | 23 March 2025 4:55 AMకంటెంట్ బేస్డ్ సినిమాలకి తెలుగులో ఉన్న స్థానం మరింత పెరిగిందనెందుకు కోర్ట్ సినిమా ఒక ఉదాహరణగా నిలిచింది. ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి, శివాజీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా సినిమా విడుదలైన మొదటి రోజునుంచే అంచనాలను బీట్ చేస్తూ మంచి రన్ కొనసాగిస్తోంది. స్టార్ హీరో లేకపోయినా, భారీ ప్రొమోషన్లు లేకపోయినా కేవలం కథనంతోనే ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రానికి ప్రెజెంటర్‌గా వ్యవహరించగా, దర్శకుడు రామ్ జగదీష్ ఈ సినిమాను ఎంతో నమ్మకంగా రూపొందించాడు.
ఇప్పటి వరకూ వచ్చిన కోర్ట్ రూమ్ డ్రామాలతో పోలిస్తే ఈ సినిమా వేరే లెవెల్‌లో నిలిచింది. ప్రేక్షకులకు న్యాయ వ్యవస్థపై ఓ ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడేలా సినిమా కథనం రూపొందించబడింది. ముఖ్యంగా చిన్న చిన్న పాత్రల్లోనూ మ్యూచువల్ కనెక్ట్ ఉండడం, ఎక్కడా బోరింగ్ అనిపించకుండా కథను ఆసక్తి నడిపించడం సినిమాకు ప్లస్ అయ్యాయి. మొదటి షో నుంచే వచ్చిన పాజిటివ్ మౌత్ టాక్ కంటిన్యూ అవుతూ బాక్సాఫీస్ రేంజ్‌ను పెంచుతోంది.
లేటెస్ట్ గా ఈ సినిమా తొమ్మిదో రోజున కూడా అదే ఊపులో కొనసాగింది. 9వ రోజున రూ.4.50 కోట్లు గ్రాస్ వసూలు చేయడం విశేషం. సాధారణంగా చిన్న సినిమాలకు విడుదలైన వారాంతం తర్వాత కాస్త తగ్గుదల వస్తుంది. కానీ ‘కోర్ట్’ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా మరింత పెరుగుతున్న కలెక్షన్లతో ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. సెలవు రోజు కావడంతో 10వ రోజున ఇంకా పెద్ద రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇప్పటి వరకూ ‘కోర్ట్’ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.46.80 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. చిన్న సినిమాగా వచ్చి, ఓవర్సీస్‌లోనూ $900K మార్క్ దాటి మిలియన్ దిశగా దూసుకెళ్తున్న ఈ సినిమా, త్వరలోనే రూ.50 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఓ కోర్ట్ రూమ్ డ్రామా మూవీకి ఇంత ఆదరణ రావడం తెలుగులో ఇదే మొదటిసారి అన్నట్టు అనిపిస్తోంది.
ఈ విజయంతో రామ్ జగదీష్ అనే కొత్త దర్శకుడికి మంచి గుర్తింపు వచ్చింది. నాని నెమ్మదిగా కానీ నిరంతరం కంటెంట్ బేస్డ్ సినిమాలకు తోడుగా నిలుస్తూ చిన్న సినిమాలకు పెద్ద విజయాలు అందిస్తున్నారు. కోర్ట్ సినిమాతో తాను ఎన్నుకున్న ప్రాజెక్ట్ ఎంత కరెక్ట్ అనిపించిందో మరోసారి నిరూపించుకున్నారు. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు సక్సెస్ అవుతూ ఉంటే.. టాలీవుడ్‌లోకి మరిన్ని ప్రయోగాత్మకమైన సినిమాలు వస్తాయని చెప్పవచ్చు.