కోర్ట్ మూవీ.. ఎవరు ఈ జాబిలి?
ఇక సినిమాలో నటించిన వారికి కూడా మంచి గుర్తింపు దక్కింది. ఇక అందులో హీరోయిన్ జాబిల్లి పాత్ర కూడా ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది.
By: Tupaki Desk | 15 March 2025 2:16 PM ISTనాని నిర్మాతగా వచ్చిన కోర్ట్ మూవీ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఇలాంటి కోర్ట్ డ్రామాలు అంతగా క్లిక్ కావని అనుకుంటున్న తరుణంలో నాని తన నమ్మకం నిజమయ్యేలా సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్లిన విధానం బాగా హైలెట్ అయ్యింది. ఇక సినిమాలో నటించిన వారికి కూడా మంచి గుర్తింపు దక్కింది. ఇక అందులో హీరోయిన్ జాబిల్లి పాత్ర కూడా ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది.
శివాజీ నటించిన మగపతి క్యారెక్టర్ అనంతరం ఈ పాప కూడా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. సింపుల్ లుక్స్, సహజమైన నటనతో ప్రేక్షకుల మనసును దోచుకుంది. ఆమె ఎవరు అనే వివరాల్లోకి వెళితే, సినిమా విడుదలకు ముందు పెద్దగా ఎవరూ గుర్తించలేదు. ప్రమోషన్స్‌లోనూ ఆమెకు అంతగా హైలైట్ కాలేదు. కానీ, సినిమా చూస్తే మాత్రం ఈ అమ్మాయికి ఫిదా కాకుండా ఉండలేరు.
కాకినాడకు చెందిన ఈ అమ్మాయి అసలు పేరు శ్రీదేవి. మొదటిగా సినిమా అవకాశాన్ని ఎలా అందుకుంది అంటే, ఇంటర్ చదువుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమెకు ఇన్ స్టా గ్రామ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే ఆమె చేసే రీల్స్ కొన్ని వైరల్ అయ్యాయి. దీంతో ఆమెను రీల్స్ లోనే చూసి దర్శకుడు రామ్ జగదీష్ ఆడిషన్ కు పిలిపించారు.
ఇక కొంతమంది పోటీ పడిన ఆమె తన సహజమైన లుక్స్ తో ఆడిషన్ లో హైలెట్ గా నిలిచి మేకర్స్ ను ఆకట్టుకుంది. ఇక తనకున్న అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుని, ‘జాబిలి’ పాత్రలో అసాధారణమైన నటనను ప్రదర్శించింది. అంతకు ముందు కొన్ని సినిమాల్లో చిన్న పాత్రలు చేసినా, అవేవీ గుర్తుండిపోయేలా లేవని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. కానీ, కోర్ట్ మూవీ ఆమెకు బ్రేక్ ఇచ్చిందని చెప్పొచ్చు.
ఆమె నటన సినిమాలో ఎన్నో హైలైట్ సీన్స్‌లో కనిపిస్తుంది. శివాజి తో ఫోన్ దొరికిపోయినప్పుడు తన అమాయకత్వాన్ని చూపిన తీరు, తల్లి ఒడిలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఎమోషనల్ హావభావాలు, కోర్ట్‌లో చందును చూసి ఉద్వేగానికి లోనయ్యే ప్రేమ, ఇవన్నీ శ్రీదేవిని ప్రేక్షకుల మనసుల్లో నిలిపేలా చేశాయి. ప్రత్యేకంగా, పెళ్లి ఫంక్షన్‌లో మేడపైకి రమ్మని సైలెంట్‌గా చేసే సైగ చూసిన వారంతా ఆమెలో ఉన్న న్యాచురల్ పెర్ఫార్మెన్స్‌పై ఫిదా అవుతున్నారు.
తెలుగులో ఇంత సహజంగా నటించే నటీమణులు అరుదు. శివాజీ, ప్రియదర్శి వంటి అద్భుత నటుల పక్కన కూడా నిలిచేలా తన ప్రెజెన్స్ చూపించగలిగింది. సినిమా కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం ఎంత ఆకట్టుకున్నా, చివరకు ప్రేక్షకుల మనసుపై నిలిచిపోయే నటన ఆమెదే. ఇప్పటికే అనేక మంది ప్రేక్షకులు, ఈ అమ్మాయి ఇంతవరకు ఎందుకు ఫోకస్‌లో లేకపోయిందని ప్రశ్నిస్తున్నారు. తెలుగులో అంజలి, స్వాతి, ఆనంది వంటి హీరోయిన్లు వచ్చిన తరహాలో, శ్రీదేవి కూడా అదే దారిలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఆమె నెక్స్ట్ సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి.