దర్శన్, పవిత్రలకు షాక్ ఇచ్చిన కోర్టు!
సిట్ చార్జ్ షీట్ దాఖలు చేయడంతో బెయిల్ వస్తుందని ఆశించారు.
By: Tupaki Desk | 15 Oct 2024 9:34 AM GMTకన్నడ నటుడు దర్శన్, నటి పవిత్రా గౌడ్ బెయిల్ రద్దయింది. తాజాగా బెయిల్ పిటీషన్ ని నగర 57వ సీసీహెచ్ కోర్టు కొట్టేసింది. దీంతో బెయిల్ కోసం ఎదురు చూసిన ఇద్దరికీ నిరాశే ఎదురైంది. రేణుకాస్వామి హత్య కేసులో మొత్తం 17 మంది అరెస్ట్ అవ్వగా ఇద్దరికీ బెయిల్ రావడంతో..దర్శన, పవిత్రలకు సైతం బెయిల్ వస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.
ఆరోపణలు ఎదుర్కోంటన్న వారికి ఆశలు చిగురించాయి. సిట్ చార్జ్ షీట్ దాఖలు చేయడంతో బెయిల్ వస్తుందని ఆశించారు. కానీ బెయిల్ సాధ్యపడలేదు. బెయిల్ పిటీషన్ పై ప్రభుత్వ తరుపు న్యాయవాది- దర్శన్ తరుపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. కానీ జడ్జ్ జైశంకర్ బెయిల్ ఇవ్వలేమని ప్రకటించారు. దీంతో దర్శన్ భార్య విజయలక్ష్మి కన్నీరుమున్నీరయ్యారు.
తాజా విచారణలో బెయిల్ వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమె మనస్తాపానికి గురయ్యారు. దర్శన్ అరెస్ట్ అయిన నాటి నుంచి విజయలక్ష్మి బెయిల్ కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేసారు. టాప్ లాయర్లందరినీ రంగంలోకి దించి ప్రయత్నాలు మొదలు పెట్టారు. బెయిల్ వస్తుందనే ఆశతో? బళ్లారి జైలు నుంచి భర్తని హెలికాప్టర్ లో ఇంటికి తీసుకెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు.
కానీ అప్పుడు ఎదురు దెబ్బ తగిలింది. జూన్ 10 నుంచి దర్శన్ జైల్లో ఉన్నాడు. తొలుత ఆయన్ని పరప్పన్ అగ్రహారం జైలుకు తరలించగా అక్కడ విలాసాలకు పోవడంతో అక్కడ నుంచి బాళ్లారి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. పవిత్రా గౌడ్ మాత్రం బెంగుళూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు.