కల్కి టికెట్ ధరలపై కోర్టులో పిల్ విచారణ
ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ వంటి దిగ్గజాలు నటించిన కల్కి చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రన్ ని కొనసాగిస్తోంది.
By: Tupaki Desk | 4 July 2024 4:46 AM GMTకల్కి సినిమా టికెట్ల ధరల పెంపుపై హైకోర్టు విచారణకు ఆదేశించింది. తొలుత కేవలం పది రోజుల వరకూ ధరల పెంపునకు అనుమతులు కోరిన నిర్మాతలు సంబంధిత శాఖల అనుమతితో మరో నాలుగు రోజులు టికెట్ ధరల్ని అదనంగా పెంచుకోవడంపై పిల్ దాఖలైంది. దీంతో సిఎస్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, నిర్మాత అశ్వనిదత్ కు హైకోర్టు నోటీసులు పంపింది. ఈ నోటీసులకు స్పందించాలని కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు వారిని కోరింది. పెరిగిన ఆ నాలుగు రోజులు టికెట్ ధరల పెంపును రద్దు చేయాలనేది పిటిషనర్ వాదన. 10వ తేదీకి విచారణ వాయిదా పడింది.
1000 పెంచాల్సిందని పవన్ అన్నారు:
కల్కి చిత్రానికి ఉత్తరాది తరహాలోనే ముందుగానే 1000 రేటు ఫిక్స్ చేసుకుని ఉండాల్సిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తమతో అన్నారని, కానీ అది తెలుగు ప్రేక్షకులకు, ఇక్కడ మార్కెట్ కు సరికాదని భావించామని నిర్మాత అశ్వనిదత్ తాజా మీడియా సమావేశంలో అన్నారు. 100 పెంపు సముచితమైనదని, అది ఎంతో కొంత నిర్మాతకు ఉపశమనం కలిగిస్తుందని అశ్వనిదత్ అభిప్రాయపడ్డారు. పెంచిన టికెట్ ధరలను ఈ ఆదివారం తర్వాత తొలగిస్తామని కూడా అన్నారు.
700కోట్ల క్లబ్ లో:
ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ వంటి దిగ్గజాలు నటించిన కల్కి చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రన్ ని కొనసాగిస్తోంది. సోమవారం తర్వాత కొంత డ్రాప్స్ ఉన్నా కానీ, ఇప్పటికీ చాలా చోట్ల కల్కి హవా కొనసాగుతోంది. ఈ సినిమా తొలి ఆరు రోజుల్లో 700 కోట్లు ప్రపంచవ్యాప్త వసూళ్లను సాధించింది. భారతదేశంలో 400 కోట్లు వసూలైందని ట్రేడ్ చెబుతోంది.
కల్కి 2898 AD అద్భుత కథనం, మనసుకు హత్తుకునే దృశ్యాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. చాలా మంది అభిమానుల విమర్శకుల దృష్టిని ఆకర్షించినది ఈ సినిమాలో ఆకట్టుకునే అతిధి పాత్రలు, వాటిలో కొన్ని ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. ఇవి కేవలం అతిధి పాత్రలు మాత్రమే అయినా వీటిని భారతీయ సినీపరిశ్రమలోని కొందరు పెద్ద స్టార్స్ కనిపించడంతో సర్వత్రా ఆసక్తి పెరిగింది. అలాగే అతిథి పాత్రల పరిచయంతో మునుముందు కల్కి సీక్వెల్‌లో కూడా ఇవి కనిపిస్తాయని కూడా స్పష్ఠత వచ్చింది.
కొంతమంది వీక్షకులు ఈ అతిధి పాత్రలు ప్రత్యేకించి ప్రభావం చూపడం లేదా కథాంశానికి అవసరమైనవి కావని నమ్ముతారు. కానీ మెజారిటీ సందర్భాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. అతిథులుగా స్టార్లను చేర్చుకోవడం డబ్బు లేదా కీర్తి గురించి కాదు.